ప్రెజెంట్ పాన్ ఇండియా మార్కెట్ లో భారీ మార్కెట్ ను తనకంటూ క్రియేట్ చేసుకున్న స్టార్ ప్రభాస్.బాహుబలి సినిమాతో ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.
ఈయన ఇప్పటికే బాహుబలి తర్వాత సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు.ఇక ఆ సినిమాలను వరుసగా పూర్తి చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో మళ్ళీ తన సాలిడ్ లైనప్ సెట్ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ప్రభాస్ స్టార్ నిర్మాణతో కల్సిన పిక్ నెట్టింట వైరల్ అయ్యింది.ఆ ప్రముఖ నిర్మాత మరెవరో కాదు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ తో ప్రభాస్ కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
ఈయన నెట్టింట పోస్ట్ షేర్ చేస్తూ ప్రభాస్ ను కలవడం ఆనందంగా ఉంది అని తనతో సినిమాలు మరియు మరిన్ని అంశాల కోసం చర్చించడం జరిగింది అని తెలిపారు.
దీంతో ఈ స్టార్ బ్యానర్ లో కూడా ప్రభాస్ సినిమా చేయనున్నాడా అనే సందేహం అందరిలో కలుగుతుంది.
ఈ కొత్త ప్రాజెక్ట్ ఏమైనా సెట్ చేయడం కోసమే అభిషేక్ అగర్వాల్ ప్రభాస్ తో కలిశాడా అనే సందేహం అందరిలో కలుగుతుంది.
చూడాలి మరి ప్రభాస్ మరిన్ని కొత్త సినిమాలు ప్రకటిస్తాడో లేదో.ప్రెజెంట్ ఈయన నటిస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ ఇప్పటికే షూట్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉంచాడు.
ఇక సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు కూడా షూట్ జరుపు కుంటున్నాయి.
వీటితో పాటు ప్రభాస్ మరో సినిమా చేస్తున్నాడు.మారుతి దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
ఇన్ని సినిమాలతో షూటింగులతో ప్రభాస్ బిజీగా ఉన్నప్పటికీ మరిన్ని కొత్త ప్రాజెక్టులు అనౌన్స్ చేసే అవకాశం ఉంది.చూడాలి మరి ప్రభాస్ ఫ్యాన్స్ కు ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తాడో.