సూర్యాపేట జిల్లా:జిల్లాలో ఆయిల్ ఫామ్ పంట సాగుపై ఉద్యాన, వ్యవసాయ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు సూచించారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో ఆయిల్ ఫామ్,వరి పంట సాగుపై సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నీటివనరులు గణనీయంగా పెరిగినందున ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో అధికారులు ఆయిల్ ఫామ్ పంట సాగు మరింత పెంచేందుకు ప్రత్యేక కృషి చేయాలని ఆదేశించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ ఫామ్ తోటల విస్తరణలక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయాలన్నారు.అలాగే ఉద్యాన,వ్యవసాయ అధికారులు నిరంతరం రైతులకు అందుబాటులో ఉండి,రైతు వేదికల ద్వారా రైతులతో ఆయిల్ ఫామ్ పంట సాగుపై క్లస్టర్ల వారిగా అవగాహన సమావేశాలు ఏర్పాటు చేసి,ఆయిల్ ఫామ్ పంటపై దృష్టి మళ్లించాలన్నారు.
జిల్లాలో క్లస్టర్ ల వారిగా ఉద్యాన, వ్యవసాయ పంట సాగు వివరాలను అందచేయాలని అధికారులను ఆదేశించారు.జిల్లాలో 2500ఎకరాల విస్తీర్ణంలో పంట సాగు లక్ష్యం కాగా ఇప్పటివరకు 1452 ఎకరాలలో ఆయిల్ ఫామ్ పంట సాగులో ఉందని, మిగతా 1048 ఎకరాలలో రైతులను గుర్తించి పంట సాగు కల్పించి లక్ష్యాన్ని పెంచనునట్లు తెలిపారు.2023-24 సంవత్సవరంలో 10 వేల ఎకరాల లక్ష్యానికి అనుకూలంగా ప్రణాళికలు సిద్ధం చేసి,రైతు వేదికల ద్వారా రైతులకు ఆయిల్ ఫామ్ పంటల సాగు, ప్రభుత్వ సబ్సిడీపై అవగాహన కల్పించాలని సూచించారు.జిల్లాలో వరి పంట నుండి ఆయిల్ ఫామ్ వైపు రైతులను ప్రోత్సహిస్తూ లక్ష్యాన్ని సాధించాలన్నారు.
ఈ సమావేశంలో డిఏఓ రామారావు నాయక్, డిహెచ్ఓ శ్రీధర్ గౌడ్, వ్యవసాయ అధికారులు సంధ్యారాణి,వాసు,జగ్గూ నాయక్,ఉద్యాన అధికారులు కె.జగన్, అనిత,స్రవంతి తదితరులు పాల్గొన్నారు.