నందమూరి బాలకృష్ణ.అదిరిపోయే యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.ఒకరకంగా మాస్ ప్రేక్షకులకు దేవుడు.ఇక బాలయ్య చెప్పే ప్రతి డైలాగు కూడా ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తూ ఉంటుంది.ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి డైలాగు బాలకృష్ణ కోసమే పుట్టిందేమో అనిపిస్తూ ఉంటుంది.అంతలా బాలకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ ఫాలోయింగ్ సంపాదించాడు.
ఇప్పుడు సీనియర్ హీరోగా ముద్ర పడినప్పటికీ బాలయ్య జోరు మాత్రం తగ్గలేదు అని చెప్పాలి. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు బాలయ్య.
ఇక ఇప్పటి వరకు బాలయ్య కెరీర్ లో ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించి శత దినోత్సవ వేడుకలను కూడా జరుపుకున్నాయ్ అని చెప్పాలి.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని కేంద్రాల్లో బాలయ్య సినిమాలకు తిరుగులేదు అని చెప్పాలి.ఇక ఇలాంటి ప్రాంతాలలో ఒకటి హిందూపురం.అక్కడ బాలయ్య క్రేజ్ ఎలా ఉందో చెప్పడానికి ఆయన రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందడాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు.ఎమ్మిగనూరు పొద్దుటూరు పట్టణాల్లో సైతం బాలయ్య నటించిన లెజెండ్ సినిమా షాకింగ్ రికార్డులను క్రియేట్ చేసింది.
ఎమ్మిగనూరు లోని మినీ శివ థియేటర్ లో 400 రోజులు ఆడితే కడప జిల్లాలోని పొద్దుటూరు లో వెయ్యికి పైగా రోజులు ఆడి రికార్డు సృష్టించింది.అందుకే ఈ రెండు ప్రాంతాలు బాలయ్య సినిమాలకు అడ్డ అని చెబుతూ ఉంటారు.ఇక బాలయ్య నటించిన రౌడీ ఇన్స్పెక్టర్, లారీ డ్రైవర్, బంగారు బుల్లోడు, నిప్పురవ్వ, బొబ్బిలి సింహం, వంశానికొక్కడు సినిమాలు కూడా ఈ ప్రాంతాల్లో ఎక్కువ రోజులు ఆడిన సినిమాలు గా రికార్డు సృష్టించాడు.
నిప్పురవ్వ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది.బంగారు బుల్లోడు సెంచరీ కొట్టేసింది.ఇక 1997లో రిలీజ్ అయిన పెద్దన్నయ్య సినిమా కూడా శతదినోత్సవం జరుపుకోవడం గమనార్హం.ఇక బాలయ్య నరసింహారెడ్డి సినిమా సోమేశ్వర టాకీస్ లో 175 రోజులు నడిచి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.2001లో శివ టాకీస్ లో విడుదలైన నరసింహనాయుడు కూడా సిల్వర్ జూబ్లీ సినిమాగా నిలిచింది.2014లో రిలీజ్ అయిన లెజెండ్ 400 రోజులు ఆడితే.బాలయ్య తాజా చిత్రం అఖండ సైతం శ్రీనివాస థియేటర్ లో 100 రోజులు పూర్తి చేసుకుంది.