సూర్యాపేట జిల్లా:దళితులను ఆర్డికంగా సుసంపన్నం చేయడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకం తెచ్చారని,దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలి అన్నదే ప్రభుత్వ సంకల్పమని,దళితబంధు పథకం కేసీఆర్ మానస పుత్రికని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.సోమవారం సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వెంల మండలం తుల్జారావుపేటలో దళితబంధు పథకాన్ని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తో కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా దళితబంధు లబ్ధిదారులకు షిప్&డైరీ యూనిట్స్,ట్రాక్టర్లు,అశోక్ లీ ల్యాండ్,టాటా కంపెనీలకు చెందిన మినీ వాహనాలు పంపిణీ చేశారు.అనంతరం గ్రామంలో దళితబంధు లబ్ధిదారులతో కలసి సహపంక్తి భోజనం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతుందన్నారు.ప్రజలు ఏమి కోరుకుంటున్నారో పాలకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అదే అమలు పరుస్తున్నారని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళితబంధు పధకం కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిందేనని స్పష్టం చేశారు.దళితబంధు పథకంతో ఆర్థికాభివృద్ధి సాధించడంతో పాటు సమాజాన్ని నిర్దేశించే వ్యక్తులుగా పెరగాలని ఆయన ఆకాంక్షించారు.
డైరీ,షిప్ యూనిట్లు అందుకున్న వారు పశుగ్రాసం పెంచుకోవడంపై దృష్టి సారించాలి అన్నారు.అదే విధంగా వాహనాలు పొందిన లబ్ధిదారులు ప్రయాణంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
తదనంతరం చివ్వెంల మండల పరిధిలోని తుల్జారావుపేట,దూరజ్ పల్లి, గుంజలూరు,తిరుమలగిరి,వల్లభాపురం,ఉండ్రుగొండ, మోదినాపురం,తిమ్మాపురం గ్రామాలకు చెందిన 51 మంది లబ్ధిదారులకు మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా కళ్యాణాలక్ష్మి/షాధిముభారక్ చెక్ లను అందజేశారు.మొత్తం 51 లక్షల ఐదు వేల 916 రూపాయల మొత్తాన్ని చెక్ ల రూపంలో లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో యంపిపి ధారావత్ కుమారి బాబునాయక్,జడ్పిటిసి సంజీవ్ నాయక్,అధికారులు శ్రీధర్ గౌడ్,రంగారావు తదితరులు పాల్గొన్నారు.