సూర్యాపేట జిల్లా:అనంతగిరి మండలం శాంతినగర్- బొజ్జగూడెం గ్రామ శివారులో ఖమ్మం- కోదాడ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం వాటర్ ట్యాంక్ ను ఇన్నోవా కారు ఢీ కొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న హుజూర్ నగర్ మండలం వేపలసింగారం గ్రామానికి చెందిన సోము కృష్ణారెడ్డి (43),అమ్మిరెడ్డి పద్మ(32) అక్కడికక్కడే మృతి చెందగా నంద్యాల ఉపేందర్ రెడ్డి(50),గోపిరెడ్డి బ్రహ్మరెడ్డి (48) లకు తీవ్ర గాయాలయ్యాయి.వేపలసింగారం గ్రామానికి చెందిన నంద్యాల ఉపేందర్ రెడ్డి, అమ్మిరెడ్డి పద్మ,
గోపిరెడ్డి బ్రహ్మరెడ్డి,సోము కృష్ణారెడ్డి ఖమ్మంలో ఒక కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రహదారి విస్తరణ పనుల్లో భాగంగా వాటర్ ట్యాంకర్ తో మొక్కలకు సిబ్బంది నీళ్లను కొడుతున్న క్రమంలో నీళ్ల ట్యాంకర్ ఒక్కసారిగా ముందుకు వెళ్లడంతో వెనుక నుండి కారు వచ్చి ఢీకొనగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా క్షతగాత్రులను ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు.