తుంగతుర్తిపై పిడుగుల వాన

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గాన్ని ప్రకృతి పగ పట్టిందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.నియోజకవర్గ పరిధిలో వరుసగా రెండు రోజులు పిడుగులు పడి,ఇద్దరు మృతి చెందడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

 Thunderstorm Over Tungaturthi-TeluguStop.com

మంగళవారం సాయంత్రం నాగారం మండల కేంద్రంలో పత్తి చేలో పిడుగు పడి కాట్రేగుల గంగమ్మ(55)మృతి చెందగా, బుధవారం సాయంత్రం తుంగతుర్తిలోని ఎస్టీ గురుకుల పాఠశాల వెనకాల పిడుగు పడి మేకలకాపరి వీరబోయిన నాగయ్య(40)తండ్రి భిక్షం మరియు మూడు మేకలు కూడా మృత్యువాత పడ్డాయి.మృతుడికి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు.

వరుస పిడుగులు,వరుస మరణాలతో తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు వర్షం వస్తే చాలు భయంతో వణికిపోతున్నారు.పిడుగుపాటుకు మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube