సూర్యాపేట జిల్లా: కుల వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న నాయీబ్రాహ్మణుల జీవితాలను కార్పొరేట్ సెలూన్ వ్యవస్థ నాశనం చేస్తుందని హుజూర్ నగర్ నాయీ బ్రాహ్మణ సంఘం ఫైర్ అయింది.సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో బీహారీ,యూపి వర్కర్లతో నడుస్తున్న కార్పొరేట్ సెలూన్లకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు నాయీ బ్రాహ్మణ నాయకులు మాట్లాడుతూ హుజూర్ నగర్ లో ఒక ధనిక కుటుంబానికి చెందిన వ్యక్తి కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ముకాస్తూ సెలూన్ ఓపెన్ చేసి అందులో పని చేసేందుకు యూపి,బీహార్ రాష్ట్రానికి నికి చెందిన వాళ్ళని వర్కర్లుగా పెట్టుకొని కుల వృత్తిని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.
వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న మంగలి వ్యవస్థని నాశనం చేసే వారికి కొమ్ము కాయొద్దని అన్నారు.
డబ్బు సంపాదనే టార్గెట్ గా కార్పోరేట్ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారని మంగలి కుల వ్యవస్థని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు.కార్పొరేట్ స్థాయిలో సెలూన్ ఏర్పాటు చేసేందుకు సిద్ధపడ్డ వ్యక్తి తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
నాయీబ్రాహ్మణ కులాన్ని అవమానించే విధంగా కార్పొరేట్ షాపు వ్యక్తులు ప్రవర్తిస్తున్నారని,ఆ వ్యక్తికి అధికార పార్టీ లీడర్ సహకరిస్తున్నారని ఆరోపించారు.కుల వృత్తులను చిన్నాభిన్నం చేసేందుకు సహకరిస్తున్న నాయకులకు సరైన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.
బీహార్ రాష్ట్ర వర్కర్లను కాకుండా తెలంగాణలో ఉన్న వ్యక్తులకు అవకాశమిచ్చి కుల సంఘ కట్టుబాట్లను గౌరవించాలని కోరారు.