సూర్యాపేట జిల్లా:సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న అనేక నేరాల్లో సైబర్ నేరాల కూడా అధిక సంఖ్యలో ఉన్నాయని, వాటికి అధికంగా యువతీ,యువకులు, విద్యార్ధులు గురవుతున్నారని షీ టీమ్స్ ఇన్చార్జి,సూర్యాపేట డిఎస్పీ పరికే నాగభూషణం అన్నారు.సోమవారం జిల్లా ఎస్పీ ఎస్.
రాజేంద్రప్రసాద్ ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో మహిళల భద్రతపై,సైబర్ నేరాలపై,పోలీస్ కళాబృందం,షీ టీమ్స్ వారి ద్వారా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు.అనంతరం పోలీస్ కళాబృందం చేత ఓటిపి ఫ్రాడ్స్,షీ టీమ్స్,మహిళల భద్రత,రక్షణ,100 డయల్,సోషల్ మీడియా,సైబర్ నేరాలు,టోల్ ఫ్రీ నెంబర్ 1930,సెల్ ఫోన్ వలన కలిగే అనర్ధాలు యువత చెడు వ్యసనాల బారిన పడకుండా ఎలా ఉండాలనే అంశాలపై ఆట,పాటల ద్వారా విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో సూర్యాపేట షీ టీం ఇన్చార్జ్ పాండు నాయక్,షీ టీం సిబ్బంది,హెడ్ కానిస్టేబుల్ ఎల్లారెడ్డి, జాఫర్,మహిళా కానిస్టేబుల్ సాయిజ్యోతి,శివరాం,కాలేజీ ప్రిన్సిపల్ సందీప్,కరస్పాండెంట్ రాము,పోలీస్ కళాబృందం సభ్యులు యల్లయ్య, గోపయ్య,చారి,నాగార్జున,కృష్ణ, గురులింగం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.