Adivi Sesh: డేట్ కి వెళ్దాం అంటూ అడివి శేష్ కి ఆఫర్ ఇచ్చిన అమ్మాయి.. హీరో రియాక్షన్ ఇదే!

హీరో అడివి శేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు.మేజర్ వంటి పాన్ ఇండియా సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నఅడివి శేష్ తాజాగా హిట్ సినిమా సీక్వెల్ చిత్రంగా హిట్ 2 ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

 Lady Fan Asks Hero Adivi Sesh For Date Details, Adivi Sesh ,adivi Sesh Lady Fan-TeluguStop.com

ఈ సినిమా మూడు రోజులలోనే బ్రేక్ ఈవెంట్ సాధించి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో అడివి శేష్ ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా మంచి విజయం అయినా సందర్భంగా ఈయన సరదాగా అభిమానులతో ముచ్చటించారు.

ఈ క్రమంలోనే సినిమా గురించి ఎంతోమంది అభిమానులు వివిధ రకాల ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబట్టారు.

ఇకపోతే ఓ అమ్మాయి మాత్రం ఏకంగా మనం ఎప్పుడు డేట్ కి వెళ్తున్నాం అంటూ ఏకంగా తనని డేట్ కి రమ్మని పిలిచారు.ఇలా ఆ అమ్మాయి కొంటెగా అడివి శేష్ ను ప్రశ్నించడంతో హీరో కూడా ఏమాత్రం తగ్గేదే అన్నట్టు షాకింగ్ సమాధానం ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

Telugu Adivi Sesh, Adivisesh, Tollywood-Movie

ఈ క్రమంలోనే ఈ ప్రశ్నపై స్పందించిన శేష్.ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్న మనిద్దరం కలిసి హిట్ 2 సినిమా చూద్దామంటూ సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా ఆ అమ్మాయితో పాటు నేటిజన్స్ కూడా షాక్ అవ్వడమే కాకుండా అడివి శేష్ సూపర్ రిప్లై ఇచ్చారని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమాకి హీరో నాని నిర్మాతగా వ్యవహరించారు వాల్ పోస్టర్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించగా నాని నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ సాధించారని చెప్పాలి.ప్రస్తుతం చిత్ర యూనిట్ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube