సూర్యాపేట జిల్లా:ఇటీవల కోదాడ పట్టణంలోని ఫ్లై ఓవర్ మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లితండ్రులను సోదరిని కోల్పొయి,తాను ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న చిన్నారి హర్షిత గురించి తెలిసిందే.హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతున్న చిన్నారి హర్షిత బుధవారం ప్రాణాలతో పోరాడి ఓడిపోయింది.చిన్నారి హర్షిత చికిత్సకు సంబంధించి రూ.1,07,000 హాస్పిటల్ బిల్ పెండింగ్ లో ఉండడంతో ఆ బిల్లు కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లాలని చెప్పడంతో బంధువులు కోదాడ ప్రాంతానికి చెందిన ప్రముఖ ఎన్.ఆర్.ఐ.సుధీర్ జలగంను సంప్రదించారు.వెంటనే స్పందించిన జలగం రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు పరిస్థితిని తెలువుతూ దయచేసి ఆ బిల్ మాఫి చేసి, చిన్నారి పార్దివదేహన్ని వారి బంధువులకు అప్పగించేలా సహయం చేయాలని వాట్సాప్ మెస్సేజ్ చేశారు.
తక్షణమే స్పందించిన మంత్రి హరీష్ రావు సహాయం చేస్తానని హామీ ఇస్తూ రిప్లై ఇచ్చారు.కేవలం 30 నిమిషాల్లో అధికారులతో మాట్లాడి రూ.1,07,000 హాస్పిటల్ మాఫి చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.ఇంతకు ముందు ప్రభుత్వం తరపున రూ.3,00,000 ఖర్చు చేసి చిన్నారిని కాపాడే ప్రయత్నం ప్రభుత్వం చేసింది.అయినా ఫలితం లేకపోయింది.
ఆరొగ్య శాఖ మంత్రి వెంటనే అత్యవసరమైన సమయంలో సహయం చేసిన మంత్రి హరీష్ రావుకి,కారణమైన సుధీర్ జలగంకు చిన్నారి హర్షిత బంధువులు క్రుతజ్ఞతలు తెలిపారు.