12న ఛలో అసెంబ్లీ

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుండి కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగ క్యాలెండర్ వేయకుండా కాలయాపన చేస్తూ నిరుద్యోగ యువకులను మోసం చేస్తుందని తెలంగాణ యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారబోయిన కిరణ్ విమర్శించారు.ఫీజు రీయింబర్స్మెంట్,స్కాలర్షిప్ లు వెంటనే ఇవ్వాలని,నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న తెలంగాణ విద్యార్ధి, యువజన సమితి ఇచ్చిన ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ స్ధానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పోస్టర్ ఆవిష్కరించారు.

 Chalo Assembly On 12th-TeluguStop.com

అనంతరం ఆయన మాట్లాడుతూ పేద పిల్లలు చదువుకునే సంక్షేమ హాస్టల్ లు, గురుకుల హాస్టల్ లను ప్రభుత్వం పట్టించుకోకపోవడం మూలంగా విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ జనసమితి అద్యక్ష ప్రధాన కార్యదర్శులు బంధన్ నాయక్,పగిల్ల శ్రీను,మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రఫీ,యువజన సమితి పట్టణ అధ్యక్షుడు శివ,ఎస్టీ సెల్ పట్టణ కన్వీనర్ దేవత్ సతీష్, యువజన సమితి నాయకులు శివ,అక్తర్,సుబ్బు, ప్రభు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube