దిల్ రాజు( Dil Raju ) ఇంట ఇటీవల పెళ్లి వేడుకలు జరిగిన సంగతి మనకు తెలిసిందే.దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు హీరో ఆశిష్ రెడ్డి( Ashish Reddy ) వివాహాపు వేడుకలు ఫిబ్రవరి 14వ తేదీ జైపూర్ లోని ఓ పురాతన ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే.
విజయవాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అద్వైత రెడ్డి( Advitha Reddy ) తో ఆశిష్ వివాహం ఎంతో ఘనంగా జరిగింది.ఈ పెళ్లి వేడుకలలో కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు.
ఇకపోతే శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో వీరి వివాహ రిసెప్షన్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది.
ఈ క్రమంలోనే ఈ వివాహ రిసెప్షన్ వేడుకకు టాలీవుడ్ సెలబ్రిటీలు మొత్తం తరలివచ్చారు.ఇలా ప్రముఖ సెలబ్రెటీలతో పాటు రాజకీయ నాయకులు సొంత ఊరు నుంచి కొంతమంది బంధువులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఇకపోతే ఈ వివాహ రిసెప్షన్ వేడుకకు ప్రముఖ నటుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda )వచ్చారు.
విజయ్ దేవరకొండ వేదిక పైకి రాగానే ఒక్కసారిగా అద్వైత ఎంతో సంతోషం వ్యక్తం చేసింది.
అద్వైత విజయ్ దేవరకొండకు వీరాభిమాని.అలాంటిది తన అభిమాన హీరోని ఒక్కసారిగా తన పెళ్లి వేడుకలలో చూడటంతో ఈమె ఆ సంతోషానికి అవధులు లేకుండాపోయాయి.ఇక ఆశిష్ స్వయంగా తన భార్య విజయ్ దేవరకొండకు ఎంత అభిమాని అనే విషయాన్ని వెల్లడించారు.
దీంతో విజయ్ దేవరకొండ అద్వైత పక్కనే నిలబడి ఫోటోలు దిగారు.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియోను ఫ్యాన్ గర్ల్ మూమెంట్ అని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్తా వైరల్ గా మారింది.