1.హైదరాబాద్ కు చేరుకున్న షర్మిల
తెలంగాణ లో కొత్తగా పార్టీ పెడుతున్న జగన్ సోదరి వైఎస్ షర్మిల బెంగళూరు నుంచి నేడు హైదరాబాద్ కు చేరుకున్నారు.
2.నేడు విశాఖకు రాజధాని రైతులు
అమరావతి పరిసర ప్రాంత రైతులు నేడు విశాఖ కు వెళ్తున్నారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన దీక్ష చేస్తున్న టీడీపీ నాయకులు పల్లా శ్రీనివాస్ దీక్షకు రేపు సంఘీభావం తెలుపనున్నారు.రేపు మరి కొంతమంది అమరావతి ప్రాంత రైతులు విశాఖకు వెళ్లనున్నారు.
3.ఎబోలా వైరస్ .నలుగురి మృతి
కొత్తగా పుట్టుకొచ్చిన ఎబోలా వైరస్ కారణంగా జెనీవా దేశంలో నలుగురు మృతి చెందారు.
4.కమలహాసన్ పార్టీ మహానాడు మార్చి 7కు వాయిదా
మక్కల్ నీది మయ్యం ( ఎం ఎన్ ఎం) 4వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీన జరగాల్సిన మహానాడు కార్యక్రమం ను మార్చి 7వ తేదీకి వాయిదా వేశారు.
5.పుదుచ్చేరి కి రాహుల్
ఈ నెల 17వ తేదీన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పుదిచ్చేరి లో పర్యటించనున్నారు.
6.వేదికపై కుప్పకూలిన సీఎం ! పీఎం ఆరా
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని వేదికపై కుప్పకూలారు.ఎన్నికల సభలో అస్వస్థతకు గురవ్వడం తో ఆకస్మాత్తుగా అహ్మదాబాద్ ఆస్పత్రికి తరలించారు.ఈ సంఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు.
7.మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.మార్చి 10న పురపాలక ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటన విడుదల చేసింది.
8.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 99 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
9.రాజేందర్ నగర్ లో చిరుత కలకలం
రాజేందర్ నగర్ లో చిరుత మరోసారి కలకలం రేపింది.ఓ ఫామ్ హౌస్ వద్ద సోమవారం తెల్లవారుజామున ఆవుపై చిరుత దాడి చేసిందని, కుక్కలు గట్టిగా అరవడం తో పారిపోయింది అని ఫామ్ హౌజ్ వద్ద పనిచేసే సిబ్బంది తెలిపారు.
10.యువరాజ్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు
భారత మాజీ క్రికెటర్, ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ చిక్కుల్లో పడ్డారు.గత ఏడాది ఓ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై హరియణ పోలీసులు కేసు నమోదు చేశారు.
11.అంతరిక్షంలోకి మోదీ ఫోటో
అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఓ శాటిలైట్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో, భగవత్ గీత, 25,000 మంది పౌరుల పేర్లను ఈ నెల 28 వ తేదీన ఓ ప్రవేట్ ఉపగ్రహం ద్వారా పంపనున్నారు.
12.మహారాష్ట్రలో కరోనా కలకలం
ఒక్క రోజు లోనే మహారాష్ట్రలో 4 వేల కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.గత 39 రోజులుగా సాధారణంగానే కేసులు నమోదయ్యాయి.
13.నేపాల్ , శ్రీలంక లోనూ బీజేపీ విస్తరణ
నేపాల్, శ్రీలంక లోనూ బీజేపీని విస్తారిస్తాము అంటూ త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
14.పోలీస్ స్టేషన్ కు హాజరైన అఖిల ప్రియ
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో మరోసారి పోలీస్ స్టేషన్ కు భూమా అఖిల ప్రియ హాజరయ్యారు.
15.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 11, 649 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
16.మెట్రో రైలు నడిపిన మహిళలు
నెహ్రూ స్టేడియం నుంచి ప్రధాని ప్రారంభించిన వాషర్ మెన్ పేట, విమ్కో నర్ మార్గంలో ఇద్దరు మహిళా ఇంజన్ డ్రైవర్లు రైళ్ళను నడిపి చరిత్ర సృష్టించారు.
17.రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సేలం రాక
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ నెల 21 న సేలం కు రానున్నట్టు తమిళ నాడు బీజేపీ ఇంచార్జి సిటీ రవి తెలిపారు.
18.పౌరసత్వ సవరణ చట్టంపై రాహుల్ స్పందన
అసోం లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు కానివ్వబోము అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
19.పాస్టాగ్ లేకపోతే రెండింతల టోల్
ఇకపై పాస్టాగ్ లేని వాహనాలకు టోల్ గేట్ వద్ద రెండింతల రుసుము వసూల్ చేయనున్నట్టు జాతీయ రహదారి, రవాణా శాఖ అధికారులు తెలిపారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,340
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,340.
.