ఫిబ్రవరి 16న జరిగే గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయండి

సూర్యాపేట జిల్లా:మోడీ( Narendra Modi ) ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16 న జరిగే గ్రామీణ బారత్ బంద్ జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేయం )జిల్లా కన్వీనర్ మల్లు నాగార్జునరెడ్డి( Mallu Nagarjuna Reddy ) పిలుపునిచ్చారు.బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో సయుక్త కిసాన్ మోర్చా జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గడిచిన పదేళ్లలో పూర్తిగా రైతాంగ వ్యతిరేక విధానాలకు పాల్పడిందన్నారు.

 Celebrate Gramin Bharat Bandh On February 16 , Suryapet District, Sk Yam Distr-TeluguStop.com

వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులు బీజేపీ ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందన్నారు.ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ లో నిధులు తగ్గిస్తూ కూలీలకు అన్యాయం చే‌స్తుందని విమర్శించారు.

ఉపాధి హామీ పథకానికి 200కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధరల చట్టం చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల కార్పోరేట్ల సంపద లక్షల కోట్ల రూపాయలు పెరుగుతుందన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కార్పోరేట్లకు అమ్ముకుంటూ దేశ భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుందన్నారు.

పేదలందరికీ మంచి రోజులు వచ్చాయని చెప్పిన బీజేపీ ప్రభుత్వం( Bjp ), నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై భారాలు మోపుతున్నారని విమర్శించారు.

సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.

బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించి దేశాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు.ఫిబ్రవరి 16న జరిగే గ్రామీణ భారత్ బందును జయప్రదం చేయాలని కోరుతూ ఫిబ్రవరి 15న సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉదయం 10 గంటలకు ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల దగ్గరలోని ఎన్టీఆర్ విగ్రహం నుండి కొత్త బస్టాండ్ వరకు భారత్ బంద్ ను జయప్రదం చేయాలని భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఎస్ కే యం జిల్లా కన్వీనర్ మండారి కుమార్( SK Yam District Convener Mandari Kumar ) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎస్ కే యం జిల్లా కన్వీనర్లు నెమ్మాది వెంకటేశ్వర్లు,బొడ్డు శంకర్, మట్టిపల్లి సైదులు,ప్రజా సంఘాల జిల్లా నాయకులు చెరుకు ఏకలక్ష్మి,వీరబోయిన రవి, వేల్పుల వెంకన్న, మేకనపోయిన శేఖర్,ఎం.రాంబాబు,పోలేబోయిన కిరణ్,వల్లపుదాసు సాయికుమార్,అర్వపల్లి లింగయ్య,యాతాకుల వెంకన్న,కోడి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube