కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం..

సూర్యాపేట జిల్లా: కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని కోదాడ పట్టణానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.శనివారం హాథ్ సే హాథ్ యాత్ర భాగంగా కోదాడ పట్టణంలో 31 వ వార్డులో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా కర పత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం చేశారు.

 Justice For People Of All Sections Is With Congress Party, Justice , Congress Pa-TeluguStop.com

ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను అంబానీలకు, ఆదానిలకు దోచిపెడుతుంటే,రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పేపర్ లీకేజీలు చేస్తూ నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందన్నారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు విసుగుచెందారని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలురి సత్యనారాయణ, యడవల్లి బాల్ రెడ్డి,షేక్ కాశిం,తోట శ్రీను,ఆళ్ళ భాగ్యారాజ్,షేక్ యాకూబ్, బాల్దురి సుధాకర్,శంకరా చారి,గాలి శ్రీనివాస్ గౌడ్, బ్రహ్మం,శోభన్,బాగ్దాద్, పర్షనబోయిన ప్రవీణ్, నరేష్,గోపి,రామారావు, సుజిత్,ఆదిత్య,నాని సతీష్,రాంబాబు,మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube