ఆశ్చర్యంగా వుంది కదూ.లేకపోతే ఇడ్లీ కోసం ఏకంగా రూ.6 లక్షలు ఖర్చు చేయడమా? అదెలాగో తెలియాలంటే మీరు ఈ కధనం చదవాల్సిందే.ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎక్కువ మందికి ఇడ్లీ అనేది ఫేవరైట్ టిఫిన్ అని చెప్పుకోవచ్చు.
మనదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో వారం రోజులూ ఇడ్లీ తినేవారు అనేకమంది వున్నారు.ఇక సాంబార్ ఇడ్లీ గురించైతే చెప్పనక్కర్లేదు.చాలా స్పెషల్ గా తింటూ వుంటారు.అయితే ఇడ్లీ( Idli ) మీద ఎవరికి ఎంత ప్రేమ ఉన్నా.
హైదరాబాద్‌కు చెందిన ఈ కస్టమర్ ముందు వారంతా దిగదిడుపే అని చెప్పుకోక తప్పదు.
అతనికి ఇడ్లీపైన ఎంత ప్రేమ అంటే సంవత్సరానికి 6 లక్షల రూపాయల విలువైన ఇడ్లీలను అతగాడు ఆర్డర్ చేసుకొని మరీ తిన్నాడు.అంటే, రోజుకు సగటున 23 ప్లేట్ల ఇడ్లీలు అని చెప్పుకోవచ్చు.ఈ గురువారం అనగా మార్చి 30న ప్రపంచ ఇడ్లీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ ‘స్విగ్గీ’ ( Swiggy )ఈ ఆసక్తికర విషయాన్ని బయట పెట్టడం విశేషం.
హైదరాబాద్‌కు చెందిన ఓ కస్టమర్ గడిచిన ఏడాది కాలంగా 8,428 ప్లేట్ల ఇడ్లీలను ఆర్డర్ చేసినట్లు వీరు తాజాగా వెల్లడించారు.హైదరాబాద్ మాత్రమే గాకుండా.బెంగళూరు, చెన్నై( Bangalore, Chennai ) నగరాల నుంచి కూడా ఆ వ్యక్తి ఇడ్లీ ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ తెలపడం కొసమెరుపు.
అయితే అతగాడు అతని కుటుంబసభ్యులు, మిత్రుల కోసం కూడా ఆర్డర్ చేసి ఉండవచ్చని నెటిజన్లు అంచనా వేస్తున్నారు.హైదరాబాద్ వాసి అయి ఉండి, బిర్యానీని వదిలేసి ఇడ్లీ ఈ స్థాయిలో ఆర్డర్ చేశాడా? అంటూ కొంత మంది నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.తమిళులు, తెలుగువారు, కన్నడిగులు ఇడ్లీలను అమితంగా ఇష్టపడుతారన్న విషయం అందరికీ తెలిసిందే.
అందుకు తగినట్టే.స్విగ్గీలో ఈ ఏడాది అత్యధికంగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల నుంచే ఇడ్లీ ఆర్డర్లు ఎక్కువగా వచ్చాయి.
ఆ తర్వాతి స్థానాల్లో ముంబై, కోయంబత్తూరు, పూణే, విశాఖపట్నం, ఢిల్లీ, కోల్‌కతా, కొచ్చి నగరాలు ఉన్నట్టు తెలుస్తోంది.స్విగ్గీ సర్వే ప్రకారం హైదరాబాద్ నగరంలో ‘వరలక్ష్మీ టిఫిన్స్’ ఇడ్లీకి ఫేమస్.
దీని తర్వాత ‘ఉడిపి ఉపహార్’ రెస్టారెంట్ నుంచి ఇడ్లీ ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నట్టు భోగట్టా.