ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా:ఎమ్మెల్యే సైదిరెడ్డి

సూర్యాపేట జిల్లా: ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు.మంగళవారం హుజూర్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి వినతిపత్రం అందజేశారు.

 I Will Work To Solve The Asha Workers Problems Mla Saidireddy, Asha Workers, Ash-TeluguStop.com

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి,ఇళ్ల స్థలాలు,ఇతర సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.కరోనా సమయంలో ఆశా వర్కర్ల సేవలు ఎనలేనివని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఇందిరాల రామకృష్ణ,డివిజన్ అధ్యక్షులు బందెల రాములు,ఉదయగిరి శ్రీనివాస్,బెల్లంకొండ శ్రీనివాస్,ఆశ సంఘం అధ్యక్ష,కార్యదర్శులు సీత, జానకి,లక్ష్మి,శైలజ,గొర్రె సుజాత,మరియమ్మ, మాలతి,స్నేహలత,నిర్మల తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube