స్పై సినిమా కి సుభాష్ చంద్రబోస్ కి మధ్య సంబంధం ఎంటి..?

కార్తికేయ 2 ( Karthikeya 2 )సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన హీరో నిఖిల్ సిద్ధార్థ్( Nikhil Siddharth ) ఆయన తీసిన సినిమాలు కొన్ని ప్లాప్ అవ్వడం తో కార్తికేయ 2 సినిమా తీసి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ అయ్యారు.

 What Is The Relationship Between Spy Movie And Subhash Chandra Bose, Nikhil Sidd-TeluguStop.com

కార్తీకేయ 2 హిట్ తో మంచి జోష్ మీద ఉన్న నిఖిల్ న‌టిస్తున్న తాజా చిత్రం స్పై.నేతాజీ సుభాష్ చంద్రబోస్( Subhash Chandra Bose ) మరణం నేపథ్యంలో సాగనున్న ఈ సినిమా టీజర్ ను నిర్మాతలు విడుదల చేశారు.

స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నిఖిల్ గూఢచారి పాత్రలో కనిపించనున్నాడు.పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది.

ఇక టీజర్ విషయానికి వస్తే… నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఫైల్ మిస్ అయిందని మకరంద్ దేశ్ పాండే చెప్పడంతో టీజర్ ప్రారంభం అవుతుంది.ఆయన 1945లో విమాన ప్రమాదంలో మరణించారు కదా అని అభినవ్ గోమటం అడగ్గా… అది ఒక కవర్డ్ స్టోరీ అని మకరంద్ దేశ్ పాండే అంటారు.

మధ్యలో యాక్షన్ సన్నివేశాలను కూడా చూపించారు.మన చరిత్ర నీ చేతిలో ఉందని నిఖిల్ తో మకరంద్ దేశ్ పాండే అంటారు.

Telugu Karthikeya, Makaranddes, Spy, Subhashchandra-Movie

ఈ టీజర్ ను చూస్తే మరోసారి జాతీయ స్థాయిలో టాకింగ్ పాయింట్ అయ్యే సినిమాను నిఖిల్ తీశారు అనిపిస్తుంది.తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో ఈ టీజర్ ను విడుదల చేశారు.స్పై( Spy ) సినిమాతో ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.జూన్ 29న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు తెలియజేసారు.స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన సీక్రెట్‌ ను కనుగొనే మిషన్‌ నేపథ్యంలో స్పై సినిమా తెరకెక్కుతోందని తెలియజేసారు.

Telugu Karthikeya, Makaranddes, Spy, Subhashchandra-Movie

దీనికి తగ్గట్టుగానే టైటిల్ లోగోలో బోస్ చిత్ర పటాన్ని ఉంచారు.అయితే ఈ సినిమా కి సుభాష్ చంద్రబోస్ కి మధ్య లింక్ అనేది ఎలా కుడుర్చుతారో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది…ఈ టీజ‌ర్ ఇప్పటికే మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంది.సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఉంది అని ఈ టీజ‌ర్ మీద వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు… సినిమా కోసం వెయింటింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.కార్తికేయ 2 తో పాన్ ఇండియా వైడ్ గా 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన నిఖిల్.

స్పై తో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube