అలసటను దూరం చేసే అద్భుతమైన ఆహారాలు

రోజంతా పని చేయటం వలన అలసట వస్తుంది.అయితే కొంత మందికి కొంచెం పని చేయగానే అలసట వచ్చేస్తుంది.

 Foods To Fight Fatigue-TeluguStop.com

అలసట వచ్చినప్పుడు ఏ పని చేయాలనీ అనిపించదు.చాలా చికాకుగా కూడా ఉంటుంది.

ఈ పరిస్థితి నుండి బయటకు రావాలంటే కొన్ని అద్భుతమైన ఆహారాలు ఉన్నాయి.ఈ ఆహారాలను తీసుకుంటే అలసటను సులభంగా తగ్గించుకోవచ్చు.ఇప్పుడు ఆ ఆహారాల గురించి వివరంగా తెలుసుకుందాం.

గ్రీన్ టీ

నరాలను ఉత్తేజపరచటానికి గ్రీన్ టీ చాలా బాగా సహాయాపడుతుంది.సాధారణంగా మనం త్రాగే కాఫీ,టీల కంటే గ్రీన్ టీలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.శరీరం లోపలి భాగాలను శుభ్రం చేసి శక్తిని ఇవ్వటంలో గ్రీన్ టీ చాలా బెస్ట్ అని చెప్పాలి.

స్ట్రాబెర్రీ

అధికమైన పీచు, అధిక ఎనర్జీ, అధిక విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న ఏ పండు తక్షణ శక్తిని అందిస్తుంది.

చీజ్

సాధారణంగా బరువు తగ్గటానికి డైటింగ్ చేసేవారు నీరసం రాకుండా కాస్త ఉత్తేజితంగా ఉండటానికి చీజ్ తీసుకుంటారు.శక్తినిచ్చే హార్మోన్లను ఇది రిలీజ్ చేస్తుంది.

అరటిపండు

అలసిన శరీరానికి గ్లూకోజ్ ను కార్బోహైడ్రేట్లను ఎంతో తేలికగాను వేగవంతంగాను ఈ పండు అందిస్తుంది.రక్తంలోని హేమోగ్లోబిన్ కు అవసరమైన ఐరన్ అందిస్తుంది.ఎంతో శక్తి కలిగి భావిస్తారు.

ఈ ఆహారాలు అలసటను తక్షణమే తగ్గించి శరీరానికి శక్తిని అందిస్తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube