రేవంత్ రెడ్డిపై దాడి చేయడం సిగ్గుచేటు

భూపాలపల్లిలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో యాత్ర చేస్తుంటే స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు,రేవంత్ రెడ్డిపై టమాటాలు,కోడి గుడ్లతో దాడి చేయడం సిగ్గుచేటని తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ మండిపడ్డారు.ప్రజాస్వామ్య బద్ధంగా కొట్లాడాల్సింది పోయి ఇలాంటి దాడులు చేయడం బాధాకరమని,ప్రతి వ్యక్తిని కలసి పేద ప్రజల బాధలు తెలుసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రజాదరణ ఓర్వలేక ఇలాంటి దాడులు చేస్తున్నారని,రాబోయే రోజుల్లో మీకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు.

 It Is A Shame To Attack Revanth Reddy , Revanth Reddy, Bhupalpalli, Hath Se Hath-TeluguStop.com

రేవంత్ రెడ్డి పైన చేసిన దాడిని తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జరిగే లాభాలను వివరిస్తుంటే ఇలాంటి దాడులు చేయడం ఏమిటని,రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అండగా ఉంటుందని తెలిపారు.

మరోసారి ఇలాంటి దాడులు చేస్తే ఊరుకునేది లేదన్నారు.రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య బద్ధంగా ఓటుతోనే బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెపుతారని తెలిపారు.

కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు తలారి అశోక్,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కోట సురేష్,పిడుగు రమేష్,గుంటి మల్లేశ్, బాలకృష్ణ,యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube