గంట సోమన్న,(ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రతినిధి):సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో సోమవారం ఉదయం ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు హాజరయ్యారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన విన్నపాలను స్వీకరించిన అయన అనంతరం ఆన్లైన్ ద్వారా సంబంధిత మండల అధికారులతో మాట్లాడి వెంటనే ఫిర్యాదుదారులకు పరిష్కారం అందేలా చర్యలు తీసుకున్నారు.