తమలపాకులు.వీటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇంట్లో పూజ జరిగినా, ఏదైన శుభకార్యం జరిగినా తమలపాకులు ఉండాల్సిందే.అలాగే తాంబూలంగా కూడా తమలపాకులను తీసుకుంటాము.
ప్రత్యేకమైన రుచి, వాసన కలిగి ఉండే తమలపాకుల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, కాల్షియం, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, ఫైబర్‌తో పాటు శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి.అందుకే ఆరోగ్య పరంగా తమలపాకులు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.
ఎన్నో అనారోగ్య సమస్యలను సైతం నివారిస్తాయి.
అలాగే చర్మ సౌందర్యానికీ తమలపాకులు అద్భుతంగా సహాయపడతాయి.
ఆరు లేదా ఏడు తమలపాకులను తీసుకుని మెత్తగా నూరి రసాన్ని తీసి నీటిలో కలిపి స్నానం చేస్తే మస్తు ప్రయోజనాలను పొందొచ్చు.ముఖ్యంగా చర్మ దురదలతో బాధ పడే వారికి తమలపాకులు బెస్ట్ మెడిసిన్‌లా పని చేస్తాయి.
అవును, ప్రతి రోజు నీటిలో తమలపాకుల రసం కలిపి స్నానం చేస్తే గనుక దురదలు క్రమంగా తగ్గిపోతాయి.

అలాగే చాలా మందికి ముఖంపైనే కాకుండా శరీరంపై కూడా మొటిమలు వస్తుంటాయి.వీటిని ఎలా తగ్గించుకోవాలో తెలీక తెగ సతమతం అవుతుంటారు.అయితే బకెట్ వాటర్‌లో నాలుగు టేబుల్ స్పూన్ల తమలపాకుల రసం, పావు టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన పసుపు కలిసి స్నానం చేయాలి.
ఇలా చేస్తే మొటిమలు రెండు లేదా మూడు రోజుల్లోనే తగ్గిపోతాయి.ఇక నీటిలో తమలపాకుల రసాన్ని కలిపి బాత్ చేయడం వల్ల.చర్మం ఎల్లప్పుడూ తాజాగా, కాంతి వంతంగా మెరుస్తుంది.మృదువైన చర్మాన్ని పొందొచ్చు.
శరీరం నుంచి దుర్వాసన రావడం తగ్గు ముఖం పడుతుంది.మరియు తమలపాకుల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మ అలర్జీలను సైతం నివారిస్తాయి.
కాబట్టి, తమలపాకులు కనిపిస్తే ఇకపై అస్సలు వదిలిపెట్టవద్దు.