అతి ఆకలి.చాలామంది ఈ సమస్యతో బాధపడుతుంటారు.కానీ పైకి మాత్రం చెప్పుకోరు.అతి ఆకలి వల్ల ఏది పడితే అది తినేస్తుంటారు.దీంతో శరీర బరువు అదుపు తప్పుతుంది.ఇక వెయిట్ గెయిన్ అయ్యారంటే గుండెపోటు, రక్తపోటు, మధుమేహం తదితర ప్రమాదకరమైన జబ్బులు చుట్టుముట్టే అవకాశాలు పెరుగుతాయి.
అందుకే అతి ఆకలి సమస్యను( Extreme hunger ) నివారించుకోవడం ఎంతో ముఖ్యం.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే స్మూతీ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.
ఈ స్మూతీ అతి ఆకలి సమస్యను దూరం చేయడమే కాదు వెయిట్ లాస్ కు కూడా సహాయపడుతుంది.
ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక యాపిల్ ( Apple )తీసుకుని వాటర్ లో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే అరకప్పు పైనాపిల్ ముక్కలను కట్ చేసుకుని పెట్టుకోవాలి.
ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు వేసుకోవాలి.అలాగే ఎనిమిది నైట్ అంతా వాటర్ లో నానబెట్టి పొట్టు తొలగించిన బాదం పప్పులను వేసుకోవాలి.

మరియు రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్( Oats ), నాలుగు నుంచి ఐదు గింజ తొలగించిన ఖర్జూరాలు, పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజల పొడి, ఒక గ్లాసు కొబ్బరి పాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా మన స్మూతీ సిద్ధం అవుతుంది.ఈ స్మూతీ టేస్ట్ గా ఉండడమే కాదు హెల్త్ కు కూడా చాలా మేలు చేస్తుంది.

ప్రతిరోజు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ స్మూతీని తీసుకుంటే అతి ఆకలి సమస్య దెబ్బకు పరార్ అవుతుంది.ఈ స్మూతీ రోజంతా మిమ్మల్ని యాక్టివ్ గా ఎనర్జిటిక్ గా ఉంచుతుంది.చిరుతిండ్ల పై మనసు మళ్లకుండా చేస్తుంది.
అదే సమయంలో క్యాలరీలను త్వరగా కరిగించి వెయిట్ లాస్ అయ్యేలా చేస్తుంది.కాబట్టి అతి ఆకలితో అల్లాడుతున్న వారు తప్పకుండా ఈ టేస్టీ అండ్ హెల్తీ స్మూతీని డైట్ లో చేర్చుకోండి.