సినిమాలో కంటెంట్ సూపర్ గా ఉన్నా.కొన్నిసార్లు కొన్నిసినమాలు థియేటర్లో సరిగ్గా ఆడవు.
కొన్ని సినిమాలు వరస్ట్ గా ఉండి థియేటర్స్ లో ఎక్కువ రోజులు ఆడవు.ఈ రెండు కేటగిరీలకు చెందిన కొన్ని సినిమాలు వెండితెరపై వెలుగులు నింపకపోయినా.
బుల్లి తెరపై మంచి రేటింగ్ తో సత్తా చాటాయి.ఎన్నిసార్లు టీవీలో ప్రసారం అయినా ఈ సినిమాలకు మినిమం టీఆర్పీ రేటింగ్స్ వస్తున్నాయి.
థియేటర్లో ఫెయిల్ అయినా.స్మాల్ స్క్రీన్ మీద దుమ్మురేపిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
అతడు
మహేష్ బాబు, త్రిష జంటగా నటించిన ఈ సినిమా మంచి కంటెంట్ తో వచ్చింది.థియేటర్లలో కొద్ది రోజులు బాగానే ఆడింది.టీవీలో దూసుకుపోయింది.మంచి టీఆర్పీ రేటింగ్ సాధించింది.ఎన్నిసార్లు సినిమా టెలీకాస్ట్ అయినా బాగానే ఆడింది.
ఖలేజా
మహేష్ బాబు, అనుష్క జంటగా నటించిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.టీవీలో మాత్రం సక్సెస్ అయ్యింది.ఎన్నిసార్లు ప్రసారం అయినా మంచి రేటింగ్స్ సాధించింది.
ఆరెంజ్
మెగాస్టార్ నటవారసుడు రామ్ చరణ్ నటించిన ఈ సినిమా ప్లాప్ అయ్యింది.జనాలకు పిచ్చి ఎక్కేలా చేసింది.కానీ టీవీలో ప్రసారం అయి మంచి రేటింగ్స్ పొందింది.
వినయ విధేయ రామ
రామ్ చరణ్, కైరా అద్వానీ, వివేక్ ఒబేరాయ్ నటించిన ఈ సినిమా పరాజయాన్ని మూటగట్టుకుంది.కానీ థియేటర్స్ లో ఫెయిల్ అయిన ఈ సినిమా టీవీలో సూపర్ విక్టరీ సాధించింది.
పైసా వసూల్
బాలక్రిష్ణ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.కానీ టీవీలో మంచి రేటింగ్ పొందింది.
అంజి
చిరంజీవి, నమ్రత జంటగా చేసిన ఈ సినిమాను కోడి రామక్రిష్ణ తెరకెక్కించారు.ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యింది.కానీ టీవీలో మంచి రేటింగ్ సాధించింది.
నేనొక్కడినే
మహేష్ బాబు, సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ సినిమా జనాలకు అంతగా ఎక్కలేదు.డిజాస్టర్ గా పేరు తెచ్చుకుంది.టీవీలో ప్రసారం అయి మంచి జనాదరణ పొందింది.
ఆగడు
దూకుడు ఊపులో ఆగడు సినిమా చేసి ఆగం అయ్యాడు మహేష్ బాబు.థియేటర్స్ లో ఫ్లాప్ అయిన ఈ మూవీ టీవీలో మంచి టీఆర్పీ సాధించింది.