లోక్ సభ ఎన్నికల్లో నోడల్ అధికారుల పాత్ర కీలకం: జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు

సూర్యాపేట జిల్లా: లోక్ సభ సాధారణ ఎన్నికల్లో నోడల్ అధికారుల పాత్ర కీలకమని,వారికి కేటాయించిన విధులను, బాధ్యతలను ఎన్నికల నిబంధన ప్రకారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ ఆదేశించారు.

 Role Of Nodal Officers Is Crucial In Lok Sabha Elections District Collector S Ve-TeluguStop.com

బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పార్లమెంట్ ఎన్నికలకు నియమించబడిన నోడల్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు 18 మంది జిల్లా అధికారులను నోడల్ అధికారులుగా నియమించినట్లు తెలిపారు.

ముఖ్యంగా ఎంసిసి నోడల్ అధికారిగా సతీష్ కుమార్, మాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా జడ్పీ సీఈఓ అప్పారావు,ట్రైనింగ్ మేనేజ్మెంట్ నోడల్ ఆఫీసర్ గా జి.శ్రీధర్ రెడ్డి,నోడల్ ఆఫీసర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ జిల్లా రవాణా అధికారి సురేష్ రెడ్డి,

నోడల్ ఆఫీసర్ ఫర్ స్వీప్ జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్,లా అండ్ ఆర్డర్ నోడల్ ఆఫీసర్ గా అడిషనల్ ఎస్పీ ఎం.నాగేశ్వరరావు,నోడల్ ఆఫీసర్ ఈవీఎం మేనేజ్మెంట్ గా సివిల్ సప్లై డిఎం పి.రాములు,నోడల్ ఆఫీసర్ ఫర్ కమ్యూనికేషన్ ప్లాన్ వెబ్ కాస్టింగ్ గా డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీసర్ కె.సురేష్ కుమార్,నోడల్ ఆఫీసర్ ఫర్ అబ్జర్వర్స్ గా డిస్ట్రిక్ట్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఆఫీసర్ ఆర్.లంసా నాయక్ నియమించడం జరిగిందన్నారు.సీనియర్ సిటిజన్స్,దివ్యాంగ ఓటర్ల హోం ఓటింగ్ విధానం బాగా ప్రచారం నిర్వహించి, ఓటు ప్రాధాన్యత ఓటు హక్కుపై కళాశాల,ఉన్నత విద్యాసంస్థల్లో స్వీప్ ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, స్వీట్ నోడల్ ఆఫీసర్ అశోక్ కుమార్ కు తెలిపారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు,సి- విజిల్,ఫిర్యాదుల స్వీకరణ,పోస్టల్ బ్యాలెట్ అలాగే పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు పలు అంశాలపై నియమింపబడిన నోడల్ అధికారులు వారి విధులు జాగ్రత్తగా నిర్వహించాలన్నారు.

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఈవీఎంస్,కర్చుల నమోదు వివరాల గురించి విప్పర్ల రమేష్,పోలింగ్ స్టేషన్లో మౌలిక వసతులు, స్విప్,మాన్ పవర్ పై వేంకటేశ్వర్లు,పోస్టల్ ఓటింగ్,పోలింగ్ మేనేజ్మెంట్,రవాణాపై శ్రీనివాసరావు పిపిటి ద్వారా నోడల్ అధికారులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, ట్రైనింగ్ మేనేజ్మెంట్ న్యూ మోడల్ అధికారి శ్రీధర్ రెడ్డి,మాస్టర్ ట్రైనర్లు విప్పర్ల రమేష్, వెంకటేశ్వర్లు,శ్రీనివాసరావు,నోడల్ అధికారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube