సూర్యాపేట జిల్లా: గతవారం కోదాడలో బోడ సునీల్ మాదిగ, మామిడి కరుణాకర్ మాదిగ,ఇరిగి శ్రీశైలం మాదిగ ఆధ్వర్యంలో ప్రారంభమైన మాదిగల సంగ్రామ మహాపాదయాత్ర శుక్రవారం జిల్లా కేంద్రానికి చేరుకున్న సందర్భంగా మహాజన సోషలిస్టు పార్టీ (ఎంఎస్పి) జిల్లా ఇన్చార్జి యాతాకుల రాజన్న మాదిగ ఆధ్వర్యంలో వారికి ఘనంగా స్వాగతం పలికారు.జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాదయాత్ర బృంద రథసారథి బోడ సునీల్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం మహాజన నేత మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు గతవారం రోజులుగా మాదిగల సంగ్రామ మహా పాదయాత్రను కొనసాగిస్తూ శుక్రవారం సూర్యాపేట పట్టణం చేరుకోవడం జరిగిందన్నారు.
గత 29 సంవత్సరాలుగా సామాజిక పరివర్తకులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో సామాజిక న్యాయమైన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం అనేక పోరాటాలు చేసి ఐదు సంవత్సరాలు వర్గీకరణ సమాన ఫలితాలు అందుకున్న పరిస్థితి అందరికీ తెలిసిందే.కానీ, కొంతకాలంగా బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని గత తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్న జాప్యం చేస్తూ మాదిగ, మాదిగ ఉప కులాలని మోసం చేస్తుందని కేంద్ర ప్రభుత్వ జాప్యానికి నిరసనగా హైదరాబాదు చుట్టూ జాతీయ రహదారుల దిబ్బంధం తెలుగు రాష్ట్రాల రాజధానుల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంగ్రామ మహా పాదయాత్ర ద్వారా పిలుపునిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాదిగల సంగ్రామ మహా పాదయాత్ర బంధం సభ్యులు మామిడి కరుణాకర్ మాదిగ,ఇరిగి శ్రీశైలం మాదిగ,కత్తుల సన్నీ మాదిగ,బుసిష్పాక నరేష్ మాదిగ,తరికొండల్ ఎంఎస్పి ఎంఆర్పిఎస్ నాయకులు ఎర్ర వీరస్వామి మాదిగ బోడ శ్రీరాములు మాదిగ, ములకలపల్లి రవి మాదిగ, దాసరి వెంకన్న మాదిగ, పుట్టల మల్లేష్ మాదిగ, కనకయ్య మాదిగ,బొడ్డు విజయ్ కుమార్ మాదిగ, ములకలపల్లి మల్లేష్ మాదిగ,దైవ వెంకన్న మాదిగ,బొజ్జ వెంకన్న మాదిగ,చెరుకుపల్లి చంద్రశేఖర్ మాదిగ,మేడి కృష్ణ మాదిగ చెరుకుపల్లి సతీష్ మాదిగ,చింత వినయ్ బాబు మాదిగ, మైకేల్ రాజు మాదిగ, తదితరులు పాల్గొన్నారు.