నల్లి తెగుళ్ళతో మిర్చి రైతుకు కన్నీళ్లు...!

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లా మోతె మండల పరిధిలోని పలు గ్రామాల్లో మిరప సాగు చేసిన రైతులు మిరప పంటకు పూత బాగా కాసి,పిందె దిగిందని సంతోష పడిన రైతులకు మాయదారి తెగుళ్లు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి నల్లి తెగులు పురుగు నట్టెట్లో మంచిదని అన్నదాతలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.లక్షలు పెట్టుబడి పెట్టి మిరప సాగు చేస్తే ఈ సారి కాలం కలిసిరాలేదని, వాతావరణ పరిస్థితులు అనుకూలించక నల్లి పురుగు సోకి పెట్టిన పెట్టుబడుల కూడా వచ్చే అవకాశం లేదని అయోమయంలో పడ్డారు.

 Mirchi Farmers Troubles With Mealy Bugs, Mirchi Farmers , Mealy Bugs, Mothe Mand-TeluguStop.com

అసలే పంట నష్టపోయి ఉంటే ప్రస్తుతం ఉన్న మిర్చి ధర ఏమాత్రం గిట్టుబాటు కాదని,దీనితో మిర్చి రైతులకు అప్పుల ఘాటు తప్పేలా లేదని వాపోతున్నారు.

మిర్చి గింజ నాటిన నాటి నుండే నిత్య పరిశీలన చేస్తూ మందులు కొట్టినా పూర్తి స్థాయిలో పురుగును అరికట్టడం లేదని,ప్రస్తుతం రైతును ఎండు తెగుళ్లు, ఎర్ర తెగుళ్లు,నల్లి పురుగు, ఫంగస్, బ్యాక్టీరియా వేరుకుళ్ళు తెగుళ్లు వెంటాడుతున్నాయని అంటున్నారు.

మిర్చి తోటతో లాభాలు పొందవచ్చని ఆశించిన తమకు నిరాశే ఎదురైందని,దీనితో చేసిన అప్పులు తీరే మార్గం కనిపించడం లేదని అంటున్నారు.మోతె మండల వ్యాప్తంగా సుమారు 1200 ఎకరాల్లో దాదాపు 300 మంది రైతులు ఈ సారి మిర్చి సాగు చేశారని తెలుస్తోంది.

ఈ సారి కాత బాగా వస్తుందనుకుంటే తెగుళ్లు వల్ల నష్టాలు మిగిలాయని, దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube