సూర్యాపేట జిల్లా:తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేశారు.అనంతరం కలెక్టర్ కార్యాలయ ఏవోకి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా టిడిపి నేతలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు తక్షణమే ఉద్యోగ నోటిఫిషన్ విడుదల చేయాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.లేకుంటే వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ కి యువత,నిరుద్యోగులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
అమలుకు నోచుకోని అడ్డమైన వాగ్దానాలు ఇచ్చి,మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊభిలోకినెట్టి,చేసిన వాగ్దానాలు తుంగలో తొక్కిన ఘనులు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు,కల్వకుంట్ల తారకరామారావులని మండిపడ్డారు.వారిని,వారి మంది మాగాధులకు వచ్చే ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ, సూర్యాపేట జిల్లా ఇంచార్జ్ నాతలా రాంరెడ్డి,దాసోజు జానకిరాములు,పార్లమెంట్ కమిటీ కార్యదర్శి దారావత్ వెంకన్న,ఆకారపు అశోక్,గోవిందాచారి,ఎల్గురి సైదులు తదితరులు పాల్గొన్నారు.