నల్లగొండ జిల్లా: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య 102 వ జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఆయన చిత్ర పటానికి కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ దామోదర సంజీవయ్య ఉమ్మడి రాష్ట్రంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా ప్రజల మన్ననలు చూరగొన్నారు కొనియాడారు.
అయన సేవలు ఎంతో అమోఘమైనవి,చాలా గొప్పవని గుర్తు చేశారు.
భారతదేశంలోనే తొలి దళిత నాయకుడిగా కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామానికి ఒక పేద ఇంటి నుంచి వచ్చిన ఆయనను ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ పార్టీదని అన్నారు.ఆయన పార్లమెంటు సభ్యుడిగా, కార్మిక శాఖ,నీటిపారుదల శాఖలను సమర్థవంతంగా నిర్వహించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.
అనేక కార్యక్రమాలు చేపట్టి దేశంలో,రాష్ట్రంలో మచ్చలేని మనిషిగా పేరు ప్రఖ్యాతలు పొందిన వ్యక్తి దామోదర సంజీవయ్య అని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి దళితులను మోసం చేశాడని,కానీ,కాంగ్రెస్ పార్టీ 1960లోనే దామోదర్ సంజీవయ్య లాంటి ఒక పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని అనేక పర్యాయాలు అనేక విధాలుగా సత్కరించి గౌరవించి ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు.
నేడు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా సంబండ వర్గాలకు అధికారం చేకూరాలంటే, న్యాయం జరగాలంటే ఈ రోజున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరారు.