ఒక భాషలో విజయం సాధించిన సినిమాను మరో భాషలోకి రీమేక్ చేసి.హిట్ చేయాలంటే గట్స్ ఉండాలి.
అసలు సినిమాలో ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉన్నది ఉన్నట్లు క్యారీ చేయడం నిజంగా చాలా కష్టం.అందుకే రీమేక్ సినిమాల విషయంలో దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
ఇతర భాషల్లో విజయం సాధించి. తెలుగులో రీమేక్ అయి హిట్ కొట్టిన చిత్రాలు చాలా ఉన్నాయి.అంతేకాదు.ఒరిజినల్ చిత్రాల కంటే తెలుగు సినిమాలే ఇంకా అద్భుతంగా వచ్చాయి.
ఇతర భాషల చిత్రాల్లోని కథను బేస్ చేసుకుని తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించడం మూలంగా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించాయి.అందులో కొన్ని బెస్ట్ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హిట్లర్
మళయాలంలో విడుదలై మంచి విజయం సాధించిన హిట్లర్ సినిమాను తెలుగులోకి రీమేక్ చేశారు.చిరంజీవి హీరోగా అదే పేరుతో తెలుగులో తెరకెక్కించారు.ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ సాధించింది.చిరంజీవి కెరీర్ లో ఓ బెస్ట్ మూవీగా నిలిచింది.
ఠాగూర్
తమిళ సినిమా రమణను తెలుగులోకి ఠాగూర్ పేరుతో రీమేక్ చేశారు.వివి వినాయక్, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది.
నువ్వే కావాలి
మళయాలం సినిమా నిరమ్ ను తెలుగులోకి నువ్వే కావాలి.తరుణ్ హీరోగా చేసిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.
శంకర్ దాదా MBBS
బాలీవుడ్ లో సూపర్ హిట్ సాధించిన సంజయ్ దత్ మూవీ మున్నాభాయ్ MBBS తెలుగులోకి రీమేక్ చేశారు.చిరంజీవి హీరోగా శంకర్ దాదా MBBS పేరుతో తెరకెక్కించారు.ఈ సినిమా మంచి హిట్ సాధించింది.
ఇడియట్
తమిళ సినిమా అప్పును పూరీ జగన్నాథ్ తెలుగులో ఇడియట్ పేరుతో రీమేక్ చేశాడు.రవితేజ హీరోగా చేసిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
సుడిగాడు
తమిళ సినిమా తమిజ్ పాదమ్ ను తెలుగులోకి సుడిగాడు అనే పేరుతో తెరకెక్కించారు.అల్లరి నరేష్ నటించిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది.
గబ్బర్ సింగ్
బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన ఈ సినిమాను తెలుగులోకి గబ్బర్ సింగ్ పేరుతో రీమేక్ చేశారు.పవన్ కల్యాణ్ నటించిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ సాధించింది.
గద్దలకొండ గణేష్
జిగర్ తండ అనే తమిళ సినిమాను తెలుగులోకి గద్దలకొండ గణేష్ పేరుతో తెరకెక్కించారు.వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా హిట్ అయ్యింది.
వకీల్ సాబ్
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ ను తెలుగులోకి వకీల్ సాబ్ గా తెరకెక్కించారు.పవన్ కల్యాణ్ నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.