తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత గత కొంతకాలంగా మయూసైటిసిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే.నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలానికి వీరిద్దరు విడాకులు తీసుకున్నారు.
విడాకులు తీసుకున్న తర్వాత ఈమె ఒంటరిగా గడుపుతూ వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో మయోసైటిసిస్ బారిన పడ్డారు.ఇలా ఈ వ్యాధి కారణంగా ఈమె కమిట్ అయిన సినిమాల నుంచి కాస్త విరామం తీసుకుని పూర్తిగా ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటూ ఉన్నారు.

ఇలా ఈ వ్యాధి కారణంగా సమంత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉండటమే కాకుండా సోషల్ మీడియాకు మీడియాకి కూడా దూరంగా ఉన్నారు.ఇప్పుడిప్పుడే తన అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటున్న ఈమె తన సినిమా వేడుకలలో భాగంగా పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు.అలాగే సోషల్ మీడియా వేదికగా తన సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.ఇక ఈమె అనారోగ్య సమస్యల నుంచి కాస్త కోలుకోవడంతో తిరిగి తన సినిమా షూటింగులలో పాల్గొనడానికి సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే సమంత పలు ఆలయాలలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు.తమిళనాడులోని దిండిక్కల్ జిల్లాలోనీ పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సమంత ప్రత్యేక పూజలను నిర్వహించారు.ఈ ఆలయంలో సమంత కొండ కింది భాగం నుంచి పై వరకు మెట్ల మార్గంకుండా ప్రతి ఒక్క మెట్టుపై దీపాలను వెలిగిస్తూ మొక్కు తీర్చుకున్నట్టు తెలుస్తుంది.అయితే ఈమె తన అనారోగ్య సమస్య నుంచి పూర్తిగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలను నిర్వహించినట్టు సమాచారం.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.