నల్లగొండ జిల్లా:ఖేలో ఇండియా హాకీ సెంటర్ పరిశీలకుడుగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి విచ్చేసిన సాయ్ కోచ్ సుబ్బారావుకు ఉమ్మడి నల్గొండ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు.బుధవారం జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో ఆయనను శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు.
అనంతరం పరిశీలకుడు సుబ్బారావు నల్గొండలో హాకీ ఖేలో ఇండియా సెంటర్ ను నిర్వహించడానికి కావలసిన మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్జీ కాలేజ్ మైదానాన్ని మరియు మేకల అభినవ్ స్టేడియం మైదానాన్ని పరిశీలించిన అనంతరం మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో ఉన్న సదుపాయాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి మక్బూల్ మహమ్మద్,ఆఫీస్ సిబ్బంది,ఉమ్మడి నల్గొండ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ కోశాధికారి బొమ్మపాల గిరిబాబు, ఉపాధ్యక్షులు ఇమామ్ కరీం,కార్యవర్గ సభ్యుడు మద్ది కర్ణాకర్,యావర్, మరియు స్టేడియం అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి షేక్ రహీం సభ్యులు పాల్గొన్నారు.