సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాన్సర్,యోగా, మెడిటేషన్,బిపి,షుగర్ లపై మంగళవారం నిర్వహించిన అవగాహన హెల్త్ మేళా కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమ్యారెడ్డి పాల్గొని ఆసుపత్రికి వచ్చిన రోగులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం,పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం,వీలైనంత వరకు బయట మసాలాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం చేయాలన్నారు.అదేవిధంగా మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ భాగ్యలక్ష్మి,ఫార్మసిస్ట్ సంధ్య,ల్యాబ్ టెక్నీషియన్ భార్గవి,అకౌంటెంట్ రవి, సిబ్బంది వెంకటేష్,ఉమా, చారి తదితరులు పాల్గొన్నారు.