రైస్ మిల్లుల వ్యర్థ నీటితో పరిసరాలు కలుషితం

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని జాన్ పహాడ్ రోడ్ లో గల శ్రీమల్లికార్జున, రాఘవేంద్ర రైస్ మిల్లులపై తగిన చర్యలు తీసుకోవాలని నేరేడుచర్ల తాహసిల్దార్ ఆఫిస్ లొ ఆర్ఐకి పలువురు స్థానిక రైతులు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిల్లుల నుండి బయటికి వచ్చే వ్యర్థ నీరు కాలువల ద్వారా నరసయ్యగూడెం చెరువులోకి ప్రవహిస్తున్నాయని,దీంతో చెరువులోని నీరు కలుషితమై చేపలు ఎదగకపోగా,చనిపోయే ప్రమాదం ఉందని,పంట పొలాల మీదుగా ప్రవహిస్తున్న మురికి నీటితో పొలాలు సైతం దిగుబడి రావడం లేదని ఆరోపించారు.

కలుషితమైన నీటిని పశువులు తాగడం ద్వారా రకరకాల జబ్బులు బారిన పడుతున్నాయని, పంట పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలకు వ్యర్ధాల నీటితో చేతులకు దురద,దద్దుర్లు పలు రకాల చర్మ వ్యాధులు సంభవిస్తున్నాయని వాపోయారు.వ్యర్ధాల మురువగు నీటిలోని దోమలతో చుట్టుపక్క ప్రాంత ప్రజలకు హాని కలిగించే ప్రమాదం ఉందని,రైస్ మిల్లులో యాజమాన్యానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పొల్యూషన్ అధికారులకు సమాచారం అందించి మా సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.సమస్య పరిష్కరించని యెడల గ్రామస్తులతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఈకార్యక్రమంలో కొప్పు రామకృష్ణ, కుంటి గొర్ల నారాయణ, కంపసాటి అంజయ్య, కాల్వ సైదులు,కొప్పు సోమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
తెలంగాణ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌... సూర్యాపేటకు 6వ స్థానం

Latest Suryapet News