సూర్యాపేట జిల్లా:కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని తమ్మరబండపాలెంలో పారిశుద్ధ్యం పడకేసింది.చెత్త చెదారం కాల్వలో వేయడంతో కుళ్ళి కంపు కొడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చెత్త సేకరణ వాహనాలు సక్రమంగా రాకపోవడంతో రోజురోజుకు కాల్వలోని చెత్త పేరుకుపోయిందని,స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం చేత సేకరణ వాహనాలతో పాటు,గ్రీన్ అంబాసిడర్లను నియమించి, పారిశుద్య నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నప్పటికీ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో అమలు జరగడం లేదని ఆరోపించారు.వ్యర్ధాలు చెత్త చెదారాలు మూటలు కాలువలో వేయడంతో దుర్వాసన వేదజల్లుతోందని అక్కడి ప్రజలు అంటున్నారు.
దీనితో దోమల బెడద ఎక్కువై ప్రజల అనారోగ్యానికి కారణం అవుతుందని వాపోతున్నారు.ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టి కాలువలోని వ్యర్ధాలను తొలగించి,ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని కోరుతున్నారు.