సూర్యాపేట జిల్లా:ఆటోలు ట్రాక్టర్లు సౌండ్ సిస్టమ్ పెట్టుకొని అధిక వేగంతో నడుపుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్ నాయక్ హెచ్చరించారు.మంగళవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని దాసారం, ముకుందాపురం గ్రామాల నుండి వచ్చే ట్రాక్టర్లు, ఆటోల సౌండ్ బాక్స్ లను ఎస్ఐ రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది సీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ టేప్ రికార్డర్ల సౌండ్ తో అతివేగంగా నడుపుతున్న డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు.ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కేసులు పెట్టి ఫైన్ వేయడంతో పాటు కఠిన చర్యలు ఉంటాయన్నారు.
ట్రాక్టర్లకు,ఆటోలకు టేప్ రికార్డులు పెట్టి అతివేగంగా రోడ్డుమీద సౌండ్ బాక్స్ లు పెట్టి నడిపి ప్రమాదాలకు గురి అయితే శిక్షతోపాటు ట్రాక్టర్లు,ఆటోలు సీజ్ చేస్తామని హెచ్చరించారు.