బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి నామినేషన్

నల్లగొండ జిల్లా:నల్లగొండ పార్లమెంటు స్థానంలో గులాబీ జెండా ఎగరేస్తామని,ప్రజల్లో ఆ ఉత్సాహం కనిపిస్తుందని,గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మేల్యే జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.మంగళవారం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ అధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ఎంపీ అభ్యర్ధి కంచర్ల కృష్ణారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.

 Brs Nalgonda Mp Candidate Kancharla Krishna Reddy Nomination , Kancharla Krishna-TeluguStop.com

అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పూటకో మాట మార్చే పార్టీ కాంగ్రెస్ అని,రుణమాఫీపై మాట మార్చారని,అన్నదాతలను నిలువునా మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని ప్రజలకు అర్థం అయిందని అన్నారు.సీఎం రేవంత్ భూతులు తిడుతూ, అబద్ధాలు ఆడుతూ,కాలం వెళ్ళబుచ్చుతున్నాడని,డిఫ్యూటీ సీఎం భట్టి రుణమాఫీకి టై ఏముంది కదా,అంతా తొందర ఎందుకని అంటున్నాడని, కాంగ్రెస్ పార్టీవి అన్ని అబద్ధాలేనని ఎద్దేవా చేశారు.

ఇక్కడున్నా ఓ జిల్లా మంత్రి రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతా అని అంటున్నాడని,వాన్నె చెప్పుతో కొట్టేందుకు రైతులు రెడీగా ఉన్నారన్నారు.నీళ్లు ఇవ్వలేని దద్దమ్మలు ఈ మంత్రులని మండిపడ్డారు.

ఈ ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే,రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించేది గులాబీ జెండానే,కేసీఆర్ కి మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందన్నారు.పదవుల కోసం నోరు మూసుకున్న నాయకులు కాంగ్రెస్ వాళ్లని,కాంగ్రెస్ వాళ్ళను తన్ని తరిమీసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

సాగర్ నీళ్లను దోచుకుపోతుంటే మంత్రులు టైంపాస్ చేస్తున్నారని,కనీస సోయి లేకుండా వ్యవహరిస్తున్నారని,సాగర్ డ్యామ్ మీదకు పోయే దమ్ము వీళ్లకు లేదన్నారు.రేవంత్ రెడ్డి జిల్లాకు వచ్చి వీటి అన్నిటిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ పార్టీ అధ్యక్షుడు రవీంద్ర నాయక్,మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి,ఎంపి బడుగుల లింగయ్య యాదవ్,కోదాడ మాజీ ఎమ్మేల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube