తుంగతుర్తిలో అన్ని పార్టీలు మాదిగలకే టిక్కెట్ ఇవ్వాలి:మంద కృష్ణ మాదిగ

తుంగతుర్తి నియోజకవర్గం( Thungathurthi Constituency )లో 80 శాతం ఉన్న ఉప కులాలతో కలుపుకొని అత్యధిక ఓట్లు కలిగిన మాదిగలకే బీఆర్ఎస్, కాంగ్రెస్,బీజేపీ పార్టీలు టికెట్ ఇవ్వాలని ఎమ్మార్పీఎస్,ఎమ్మెస్సీ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ( Manda Krishna Madiga ) ఆన్నారు.మే 19 న తిరుమలగిరి పట్టణ కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ అఖిలపక్ష మరియు మాదిగలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇప్పటి వరకు క్షమాపణలు చెప్పకపోవడంతో శనివారం తిరుమలగిరిలో నిర్వహించిన అఖిలపక్ష భేటీకి ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లడుతూ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకొని అఖిలపక్ష నాయకులకు తక్షణమే దళిత సోదరులందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

 Manda Krishna Madiga Sensational Comments At Pressmeet,manda Krishna Madiga,sury-TeluguStop.com

లేనిపక్షంలో తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు తప్పవని హెచ్చరించారు.తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న మాదిగలను బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS Govt ) చిన్నచూపు చూస్తుందని, మాదిగలపై మాదిగలతో దాడి చేయిస్తూ అణిచి వేయాలని చూస్తుందని, ఇది సబబు కాదన్నారు.
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కు టికెట్ ఇవ్వకూడదని,మాదిగలకు కాకుండా మాలలకు టికెట్ ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటమికి అన్ని పార్టీలతో కలిసి కార్యాచరణ తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు కందుకూరి సోమన్న మాదగ,వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గం అభ్యర్థి ఏపూరి సోమన్న, బీజేపీ నాయకులు కడియం రామచంద్రయ్య, తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ కందుకూరు శీను, మల్లెపాక సాయిబాబా, కందుకూరి అంబేద్కర్, వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు పరమేష్ మరియు అఖిలపక్షాల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube