తెలంగాణ కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు జయశంకర్:మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసి ఆజన్మాంతం బ్రహ్మచారిగా గడిపిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Guntakandla Jagadish Reddy )అన్నారు.బుధవారంజయశంకర్ సార్ వర్ధంతి( Professor Jayashankar Sir ) వేడుకలు జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగాయి.

 Jayashankar Who Sacrificed His Life For Telangana: Minister Guntakandla Jagadis-TeluguStop.com

ఆయ‌న చిత్ర పటానికి పూలమాల వేసి మంత్రి ఘనంగా నివాళులర్పించి, జ‌య‌శంక‌ర్ సార్ సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను గల్లీ నుంచి ఢిల్లీ దాకా వ్యాప్తి చేయడంలో వారి పాత్ర మరవలేనిదన్నారు.1952 లో జయశంకర్ సార్ నాన్ ముల్కీ ఉద్యమంలో, తర్వాత సాంబార్,ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమం,1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు.ఎవరు మాట్లాడటానికి సాహసించని కాలంలోనే 1954 విశాలాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టిన ధీశాలి జయశంకర్ సార్ అని కొనియాడారు.

నీళ్లు,నిధులు, నియామకాలు సార్ కల అని,సీఎం కేసీఆర్ దానిని నిజం చేసిచూపించారని ప్రశంసించారు.విద్యార్థి దశ నుంచే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల పట్ల,అసమానతల పట్ల తీవ్రంగా పోరాటం చేశారన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపి బడుగుల,జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,మున్సిపల్ చైర్మన్ పెరుమాళ అన్నపూర్ణ,టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు,మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్ కుమార్,కౌన్సిలర్లు జహీర్, బత్తుల జానీ,రాపర్తి శ్రీనివాస్,భరత్ మహాజన్, అనంతుల యాదగిరి, టిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ ముదిరెడ్డి అనిల్ రెడ్డి,టిఆర్ఎస్వి నేతలు ఎలక హరీష్ రెడ్డి, ఎలుగూరి రమా కిరణ్,షేక్ రఫీ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube