రేపు ఆందోళనకు సిద్దమవుతున్న అడ్లూరు వాసులు

సూర్యాపేట జిల్లా:పులిచింతల ప్రాజెక్ట్ నిర్వాసిత గ్రామం అడ్లూరు.అప్పుడు చింతలపాలెం మండలంలో ఉండగా ప్రాజెక్టులో మునిగిపోయింది.

 Adluru Residents Preparing For Tomorrow's Agitation-TeluguStop.com

అక్కడి నుండి వారిని కోదాడ మండలంలోకి తరలించారు.ప్రస్తుతం కోదాడ మండలం గుడిబండ శివారులో ఉన్న అడ్లూరు గ్రామంలో నిర్వాసితులకు కేటాయించిన ప్లాట్లను అక్రమంగా విక్రయిస్తున్నారని,వెంటనే ఆ ప్రక్రియను ఆపేయాలని డిమాండ్ చేస్తూ రేపు బుధవారం 15 న గ్రామస్థులంతా కలసి హుజుర్ నగర్ ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నట్లు సమాచారం.

*నిర్వాసితుల ప్రధాన డిమాండ్లు ఇవే*

1.పులిచింతల పునరావాస కేంద్రం అయినటువంటి కోదాడ మండలం గుడిబండ శివారులోని అడ్లూరు ఆర్ అండ్ ఆర్ సెంటర్ కి ఇతర పులిచింతల ఆర్ అండ్ ఆర్ సెంటర్ నుండి ప్లాట్ల బదిలీలు వెంటనే నిలిపివేయాలి.2.అడ్లూరు ఆర్ అండ్ ఆర్ సెంటర్ లో ఇప్పుడు దాకా అక్రమ మార్గంలో చేసిన రిజిస్ట్రేషన్లను వెంటనే రద్దు చేయాలి.3.ఫేక్ పట్టాలను తయారు చేసి ఉన్నత అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసిన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలి.4.అడ్లూరు ఆర్ అండ్ ఆర్ సెంటర్లో ఖాళీగా ఉన్న అన్ని ప్లాట్లను రీ సర్వే చేసి అర్హులైనటువంటి గ్రామానికి చెందిన ప్రజలకు కేటాయించాలి.5.అడ్లూరు ఆర్ అండ్ ఆర్ సెంటర్ యొక్క అధికారాలను కోదాడ డివిజన్ పరిధిలోకి తీసుకురావాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube