యువత సహనానికి పరీక్ష పెట్టొద్దు

ఆగ్రహం కట్టలుతెంచుకుంది బిజెపి పాలిత రాష్ట్రాల నుండే.అదే సెగ తెలంగాణాకు చేరింది.

 Do Not Test The Patience Of The Youth-TeluguStop.com

బీజేపీ నుండి ఎదురయ్యే ప్రమాదాన్ని యువత గుర్తించింది.అందుకు పరాకాష్టే సికింద్రాబాద్,బీహార్ లు.అసహనానికి లోనైతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి.అగ్నిపథ్ ను వెనక్కి తీసుకోండి.

దేశాన్ని సంక్షోభంలోకీ నెట్టిన మోడీ సర్కార్.అగ్నిపథ్ పైకి కనపడుతున్న ఒక కారణం మాత్రమే.

యువత ఆగ్రహం వెనుక ఎనిమిదేండ్ల మోడీ చర్యలు ఉన్నాయి.-మంత్రి జగదీష్ రెడ్డి.

సూర్యాపేట జిల్లా:కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన ఆర్మీ రిక్రూట్మెంట్ నూతన విధానం అగ్నిపథ్ ను ఉపసంహరించుకోవాలంటూ ఉద్యమం మొదలైందే బీజేపీ పాలిత రాష్ట్రాల నుండి అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.అందుకు కొనసాగింపే శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన సంఘటనలని తేల్చిచెప్పారు.

శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడాతూ బీజేపీ నుండి ఎదురయ్యే ప్రమాదాన్ని యువత గుర్తించినందునే వారి ఆగ్రహం కట్టలు తెంచుకుందన్నారు.అందుకు పరాకాష్టే బీహార్,సికింద్రాబాద్ ఉదంతాలని ఆయన చెప్పారు.

ఇది మరింత ముదరక ముందే మోడీ సర్కార్ అగ్ని పథ్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.అగ్నిపథ్ పై జరుగుతున్న పొరాటంగా పైకి కనిపిస్తున్నప్పటికి బీజేపీ పాలనపై రగిలిపోతున్న యువత ఆగ్రహం ఈ రూపంలో వెల్కడైందన్నారు.

సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామన్న మోడీ ఎన్నికల వాగ్దానం అమలుకు నోచుకోక పోవడం కుడా కట్టలు తెంచుకున్న యువత ఆగ్రహానికి ఒక కారణంగా కనిపిస్తోందన్నారు.మోడీకి ముందు దేశాన్ని పాలించిన పాలకులు దోచుకొని విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని తెస్తానని ఎన్నికల్లో లబ్దిపొందిన మోడీ సర్కార్,ఆ పద్దతిలో చర్యలు తీసుకోక పోవడం కుడా వారి ఆవేశానికి కారణంగా కనిపిస్తుందన్నారు.

అటువంటి అగ్నిపథ్ ను తక్షణం ఉపసంహరించుకోవాలని అన్నారు.ఆక్రోశంతో రగిలిపోతున్న యువత సహనానికి పరీక్షలు పెడితే ఎదురయ్యే పరిణామాలకు బీహార్,సికింద్రాబాద్ సంఘటనలు అద్దం పడుతున్నాయన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube