సూర్యాపేట జిల్లా:మంగళవారం సాయంత్రం కురిసిన గాలి వానకు మోతె మండలం సిరికొండ గ్రామానికి చెందిన కోడిరెక్క వెంకన్న ఇంటిపై నున్న రేకులు గాల్లో ఎగిరి పడ్డాయి.ఇంటి పైకప్పు లేకపోవడంతో వర్షానికి గోడలు కూలిపోయాయి.
సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.ఇంటి పైకప్పు లేచిపోయి,గోడలు కూలిపోవడంతో వెంకన్న కుటుంబం వీధిన పడ్డది.
నిరుపేద కుటుంబానికి చెందిన వెంకన్నను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.