'మేజర్‌' సినిమా మహేష్ బాబుదేనా.. ఎక్కడ కనిపించడేం?

సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు ఎంబీ క్రియేషన్స్ ను మొదలు పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది.ఇప్పటి వరకు బయట హీరోలతో సినిమాలను చేసిందే లేదు.

 Major Producer Mahesh Babu Not Active In Promotions , Flim Major, Flim News, Ma-TeluguStop.com

తన అన్ని సినిమాల సహ నిర్మాణ సంస్థగా ఎంబీ క్రియేషన్స్ ను జోడిస్తున్నారు.అంతే తప్ప మొదటి సారి ఒక పెద్ద బడ్జెట్ తో బయట హీరోతో సినిమాను చేయడం వల్ల అందరి దృష్టిని ఆకర్షించడం జరిగింది.

భారీ అంచనాల నడుమ రూపొందిన మేజర్ సినిమా ను మహేష్ బాబు నిర్మించిన విషయం తెల్సిందే.సోని ఎంటర్ టైన్మెంట్స్ వారు ఈ సినిమాను మహేష్ బాబు తో కలిసి నిర్మించారు.

ఈ సినిమా నిర్మాణం విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.మేజర్‌ సినిమా కు మహేష్ బాబు నిర్మాణ సంస్థ యొక్క భాగస్వామ్యం ఎంత అయ్యి ఉంటుంది అనేది చాలా మంది ప్రశ్న.

మేజర్‌ లో మహేష్‌ బాబు ఎంత పెట్టుబడి పెట్టాడు అనేది చర్చ.టాలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం మహేష్ బాబు ఎలాంటి పెట్టుబడిని కూడా మేజర్ సినిమాలో పెట్టలేదు.

అసలు మేజర్‌ సినిమా కు తన బ్రాండ్‌ ఇమేజ్ ను జోడించి మహేష్ బాబు డబ్బును తీసుకుంటాడు.అందుకే మేజర్‌ సినిమా ప్రమోషన్‌ లో ఎక్కువగా పాల్గొనడం లేదు అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో మేజర్‌ సినిమాకు మహేష్ బాబు నిజంగా నిర్మాత అయ్యి ఉంటాడా అంటూ కూడా పుకార్లు పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అడవి శేష్‌ పూర్తిగా ప్రమోషన్ కార్యక్రమాలను చూసుకుంటున్నాడు.

ఆయన ఒంటి చేత్తో ప్రమోషన్‌ ను చూసుకుంటూ అంతే బాధ్యతతో సినిమాను ముందుకు తీసుకు వెళ్తున్నాడు.మేజర్‌ సందీప్ జీవిత కథ ఆధారంగా సినిమాను రూపొందించిన విషయం తెల్సిందే.

ఇప్పటికే ప్రీమియర్ లు పడటంతో సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube