సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పుస్తకాలు,దుస్తులు పంపిణీ చేసిన అనంతరం మాజీ మంత్రి,సూర్యాపేట ఎమ్మేల్యే జగదీష్ రెడ్డి( Jagadish Reddy Guntakandla )మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు మర్చిపోయి,గత ప్రభుత్వ హయంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ళు,కాళేశ్వరం ప్రోజెక్టులపై విమర్శలు చేస్తూ కాలం వెళ్ళబుచ్చుతుందనివిమర్శించారు.ప్రభుత్వ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకుంటూ కమీషన్ల ఏర్పాటు పేరుతో డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు.
విచారణ కమీషన్లు వాటి పని అవి చేసుకుంటాయని, ప్రభుత్వం ఎందుకు లీకులు ఇస్తుందని ప్రశ్నించారు.ఎన్నికల కోడ్ ముగిసాక హామీల అమలుపై ప్రజలునిలదీస్తారని కమీషన్ల విచారణ పేరుతో మీడియాకు లీకుల డ్రామాలు ఆడుతున్నారని,కాంగ్రెస్ పసలేని ఆరోపణలన్ని వరుసగా తెలిపోతున్నాయని, కాళేశ్వరం( Kaleshwaram )లో నీళ్ళు నిలిపి సాగునీరు అందించకుండా తప్పు చేస్తున్నారని,నాలుగు నెలలుగా సమయం వృధా చేసి ఇప్పుడు హడావిడి చేస్తున్నారని ఆరోపించారు.
గత ప్రభుత్వ లోపాలంటూ ఆరోపణలను రాజకీయాల కోసం వాడుకుంటున్న విషయం ప్రజలు గమనిస్తున్నారని,నీళ్ళు, విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు
ప్రజలు మంచినీళ్ళ కోసం రోడ్లెక్కే పరిస్థితి కనిపిస్తోందని, పదేళ్ళ క్రితం ఉన్న దుస్థితి మళ్ళీ దాపురించిందన్నారు.పత్తి విత్తనాల కొరతలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారని, పత్తి విత్తనాల బ్లాక్ దందాలో ఓ మంత్రి పాత్ర ఉందని, ఆధారాలు రాగానే త్వరలో పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడిస్తామన్నారు.
ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టకుండా తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా మీడియాకు లీకులిచ్చి చెత్త,రోత రాతలు రాపిస్తున్నారని,ఎన్ని కమీషన్లు వేసినా అభ్యంతరం లేదని,కమీషన్ల విచారణ కంటే మీడియా లీకులు ఎక్కువైయ్యాయన్నారు.కమీషన్ల విచారణ పేరుతో రైతు రుణమాఫీపై దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.