అంతుచిక్కని వ్యాధితో అల్లాడుతున్న నారాయణపురం...!

సూర్యాపేట జిల్లా: చిలుకూరు మండలం నారాయణపురం గ్రామంలో ఎస్సీ కాలనీలో పసిపిల్లల నుండి 70 ఏళ్ల వృద్ధుల వరకు విషజ్వరాల బారినపడి, కాళ్ళ,కీళ్ల,కండరాల నొప్పులు,శరీరంపై నల్ల మచ్చలతో సుమారు 250 మంది గత 45 రోజుల నుండి వింత వ్యాధితో బాధపడుతున్నారు.ఎస్సీ కాలనీలో 150 కుటుంబాలుండగా ఏప్రిల్ మొదటి వారం నుండి నేటి వరకూ ప్రతి కుటుంబంలో ఒకరికి ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి.

 Narayanapuram Is Reeling With An Elusive Disease, Narayanapuram , Disease, Myste-TeluguStop.com

దీనితో కొత్తవాళ్లు గ్రామంలోకి రావాలన్నా,వారితో మాట్లాడాలన్నా భయంతో వణికిపోతున్నారు.వ్యాధి సోకని కుటుంబ సభ్యులు సైతం మూతికి,ముక్కుకి గుడ్డలు అడ్డం పెట్టుకొని దూరంగా ఉండి మాట్లాడుతున్నారు.

ఉదయం మంచిగా ఉన్నవారు,సాయంత్రం కల్లా వ్యాధిగ్రస్తులుగా మారుతున్నారు.ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఉన్నతాధికారులు,ప్రజా ప్రతినిధులు,రాజకీయ నేతలు తమ వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదని, దళితులం కాబట్టే తమను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హెల్త్ క్యాంప్ పెట్టినా తగ్గు ముఖం పట్టని వైనం…!

చిలుకూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది గత 15 రోజుల నుండి గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు.జ్వరం నొప్పులతో బాధపడుతున్న బాధితులకు రక్త పరీక్ష చేసి మందులు పంపిణీ చేస్తున్నారు.

మందులు వాడినంతసేపు నొప్పులు తగ్గి,తర్వాత యధావిధిగా ఉంటుందని బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు.ప్రైవేట్ ఆస్పత్రిలో కూడా రక్త పరీక్షలతో పాటు అన్ని పరీక్షలు చేయించుకున్నా, వ్యాధి ఏమిటో రిపోర్ట్ లో రావడం లేదని వాపోతున్నారు.

రోజువారి కూలికి వెళ్తే కానీ,ఇల్లు గడవని తమకు ఇలాంటి జ్వరం రావడంతో రెండు నెలల నుండి ఎటువంటి పనిలేక ఇల్లు గడిచే పరిస్థితి లేదని,కనీసం ఇంటి పని చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నామని, డబ్బులు లేకపోవడంతో పస్తులు ఉంటున్నామని కన్నీటిపర్యంతమయ్యారు.ఇంత వరకు అధికారులు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు ఇటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదన్నారు.ఇక్కడి పరిస్థితిపై కవరేజ్ కి వచ్చిన విలేకరులు మానవతా దృక్పథంతో కొంత సహాయం అందించారని చెబుతున్నారు.

భయపడాల్సిన పనిలేదు లేదంటున్న వైద్యాధికారి

నారాయణపురం వింత వ్యాధిపై జిల్లా వైద్యాధికారి కోటా చలం శనార్తితో మాట్లడుతూ గ్రామంలో ఎవరూ అధైర్యపడవద్దని, దీని కొరకు ప్రత్యేక హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశామని తెలిపారు.ఇవి సాధారణ జ్వరాల లాంటివే తప్ప ఎలాంటి ప్రమాదం లేదని,ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.ప్రజలు తమ పరిసరాలను శుభంగా ఉంచుకొని,దోమలు లేకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

త్వరలోనే గ్రామంలో సాధారణ పరిస్థితి వస్తుందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube