ఆధార్ లేదని బడిలో చేర్చుకోవడం లేదు

సూర్యాపేట జిల్లా:సార్వత్రిక నమోదు ప్రకారం 100% బడి ఈడు పిల్లలను బడిలో చేర్చుకోవాలని ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేస్తున్నా కొన్నిచోట్ల కొద్దిమంది ఉపాధ్యాయులు బడి ఈడు పిల్లలను ఆధార్ కార్డు లేదని,ఇతర చిన్న చిన్న కారణాలతో బడిలో చేర్చుకోకుండా వెనక్కి పంపిస్తున్నారని విన్నపం ఒక పోరాట స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు లీలావతి చీకూరి ఆవేదన వ్యక్తం చేశారు.శుక్రవారం హుజూర్ నగర్ మండలం గోపాలపురం గ్రామంలో ఆధార్ కార్డు లేదనే కారణంతో గత మూడు సంవత్సరాలుగా పిల్లలను బడిలో చేర్చుకోలేదని తెలుసుకొన్న విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా స్పందించి ఐసిడిఎస్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లగా గోపాలపురం గ్రామ అంగన్వాడీ టీచర్స్,ఉపాధ్యాయునితో మాట్లాడి విద్యార్థిని బడిలో చేర్పించారు.

 No Admission In School Without Aadhaar-TeluguStop.com

అనంతరం ఆమె మాట్లాడుతూ ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల తల్లిదండ్రులు పిల్లలను బడిలో చేర్పించలేక వాళ్ళని ఇంటి పనికో,బయట పనికో,చివరికి పిల్లలను అడుక్కోటానికి కూడా పంపుతున్నారని,పిల్లల భవిష్యత్తుని వెట్టి చాకిరికి అంకితం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.దీనికి కారణం ఒకరకంగా ఆయా గ్రామాల్లో ఉన్న ఉపాధ్యాయుల ఆలోచన, ప్రవర్తనే కారణమని ఆరోపించారు.

ఉపాధ్యాయులు చేస్తున్న చిన్న తప్పిదంతో పిల్లల బంగారం లాంటి బాల్యం విద్యకు దూరమైపోతుందని అన్నారు.దీనితో సంచార జాతులుగా తిరిగే కుటుంబాలు,గిరిజన తెగలకు చెందిన పిల్లల పరిస్థితి మరి అద్వానంగా తయారవుతుందని,కొద్ది మంది ఉపాధ్యాయులు తమ పనితీరుతో పసిపిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారని వాపోయారు.

జీతాల కోసం వచ్చి పోతున్నట్టు కొంతమంది ఉపాధ్యాయులు ఫోన్లతో టైం పాస్ చేస్తున్నారని,పనితీరు ఇలాగే ఉంటే బడుగు,బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందన్నారు.ఒక పాప మా విన్నపం ఒక పోరాటం దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చింది కాబట్టే మావంతుగా సహాయం,న్యాయం చేయగలిగామని,విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ తరఫున ఆ పాపకు డ్రెస్సు,బ్యాగ్,స్లేట్, పెన్సిల్,చెప్పులు కొనివ్వడం జరిగిందన్నారు.

దీనితో ఆ పాప,ఆమె తల్లి సంతోషం వ్యక్తం చేశారని,తన సోదరులకు కూడా కొనివ్వాలని కోరడంతో మా సంస్థ తరుపున తప్పకుండా కొనిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.మీ ఏరియాలో కూడా ఇలాంటి విద్యార్థులు ఉంటే ప్రతి ఒక్కరూ మంచి మనసుతో ముందుకు రావాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube