సూర్యాపేట జిల్లా:జిల్లా వ్యాప్తంగా ధరణిలో పనిచేస్తున్న 26 మందిని కంప్యూటర్ ఆపరేటర్లకు గత ప్రభుత్వం 2018 నుండి 2021వరకు రూ.9878,2021 నుండి 2023 డిసెంబర్ నెల వరకు రూ.11,583 జీతం చెల్లించిందని,కానీ,ఏ ఒక్క నెలలో కూడా సక్రమంగా జీతాలు చెల్లించక రవాణా, కుటుంబ పోషణ భారమై అనేక ఇబ్బందులు పడ్డామని, ఎనిమిది నెలల జీతం పెండింగ్ లో ఉందని ధరణి కంప్యూటర్ ఆపరేటర్లు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.పెండింగ్లో ఉన్న ఎనిమిది నెలల జీతం నేటికైనా మంజూరు చేయాలని, ధరణి కంప్యూటర్ ఆపరేటర్లుగా మహిళలు కూడా విధులు నిర్వహిస్తున్నారని, వారికి వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని కోరారు.
జీతాలను డిడిఓ ద్వారా గాని,కలెక్టర్ ద్వారా గాని ఇప్పించాలని,ఈ ప్రభుత్వంపై మాకు పూర్తి నమ్మకం ఉందని ఖచ్చితంగా మా జీవితాల్లో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.