టిఆర్ఎస్ ను వీడి బీఎస్పీలో చేరనున్న విద్యార్థి ఉద్యమ నాయకుడు?

సూర్యాపేట జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులకు తగిన గుర్తింపు లభించలేదనే వాదన వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో ఉద్యమ కారులు గత కొంత కాలంగా వేచి చూసే ధోరణి అవలంభించినా ఇక లాభం లేదనుకొని,తమకు టీఆర్ఎస్ లో న్యాయం జరగదని గ్రహించి తప్పని పరిస్థితుల్లో అందులో నుండి బయటపడేందుకు దారులు వెతుకుంటున్నారు.

 Which Student Movement Leader Will Leave Trs And Join Bsp?-TeluguStop.com

ఇందులో భాగంగా టిఆర్ఎస్ ను మరో ఉద్యమకారుడు వీడనున్నట్లు తెలుస్తోంది.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థి ఉద్యమ దశ నుంచే చిన్న వయసులోనే ఈ ప్రాంత అనేక పోరాటాలలో పాల్గొని హుజూర్ నగర్ నియోజకవర్గ,ఉమ్మడి నల్లగొండ జిల్లా,రాష్ట్రస్థాయిలో విద్యార్థి ఉద్యమ నాయకుడిగా పేరు తెచ్చుకున్న నేరేడుచర్ల వాసి రాపోలు నవీన్ ఈరోజు టిఆర్ఎస్ పార్టీని వీడనున్నారని సమాచారం.

టిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఆరోపణల నేపథ్యంలో హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పాత ఉద్యమకారులు అందరూ తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్టీ పటిష్టతకు,పార్టీ అధికారంలోకి వచ్చే వరకు ఎన్నో పోరాటాలు చేసి,కేసులతో జైలు పాలై ఆర్థికంగా ఇబ్బంది పడ్డ అప్పటి ఉద్యమకారులు అందరూ అసంతృప్తిగానే ఉన్నారని తెలుస్తోంది.కొందరు పార్టీపై అభిమానంతో పక్కచూపులు చూడలేక భవిష్యత్తుపై ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నారు.

కానీ,ఇప్పటికీ ఎలాంటి మార్పు రాకపోవడంతో సాధారణ కార్యక్రమాలకు సైతం పిలుపే బంగారమాయే అన్న చందంగా తయారైన పరిస్థితులను జీర్ణించుకోలేక ఇప్పటికే కొంతమంది పార్టీని వీడారు.ముందొచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి అన్న చందంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో పార్టీని గెలుపు దిశగా ఉరుకలు వేయించిన నాయకులందరూ మౌనంగానే ఉన్నారు.

సరైన సమయం కోసం ప్రత్యామ్నాయం అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అనునిత్యం ఏదో ఒక అవసరం కోసమో,అవకాశం కోసమే పార్టీలో ఉన్నారు తప్ప,పార్టీని వీడాలనే ఆలోచన చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోందని తెలుస్తోంది.

పైపైకి పొగడ్తలతో ముంచెత్త నేతలే లోలోన రగిలిపోతూ సరైన సమయం ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నట్టు అనేక సర్వేలు చెపుతున్నాయి.గులాబీ బాస్ ఇలాంటి పరిణామాలు ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి మందలిస్తున్నా నాయకత్వంలో మార్పు రాకపోవడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడి పార్టీని వీడుతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.

సూర్యాపేట జిల్లాలో నేడు రేపో టిఆర్ఎస్ ను వీడి బీఎస్పీలో చేరనున్న ఈ విద్యార్థి ఉద్యమ నాయకుడి బాటలో అతిత్వరలో నియోజకవర్గంలోని మరికొంతమంది పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇదే జరిగితే హుజూర్ నగర్ నియోజకవర్గంలో పెనుప్రమాదం తప్పదని పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube