సేగ్రీగేషన్ లెక్కలు మాత్రమేనా సేంద్రీయం జాడేది...?

సూర్యాపేట జిల్లా: గ్రామాల పరిశుభ్రతే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీలో సేగ్రీగేషన్ షెడ్స్ ఏర్పాటు చేసి తడి పొడి చెత్తను సేకరించి కంపోస్ట్ ఎరువులు తయారీ చేసి అమ్మకం ద్వారా ఆదాయం మార్గాలతో పాటు హరితహారం మొక్కలు పెంపకానికి ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంపోస్ట్ ఎరువులు తయారీ కాగితాలకే పరిమితం అయింది.షెడ్ల నిర్మాణంతో లబ్ధి పొందిన పంచాయితీలు ప్రభుత్వం ఆశించిన లక్ష్యం మాత్రం నెరవేరలేదు.

 Segregation Calculations Are The Only Organic Trace, Segregation , Organic , Seg-TeluguStop.com

జిల్లాలోని గత నెల డైలీ రిపోర్ట్ ఆధారంగా 23 మండలాల్లోని 475 గ్రామపంచాయతీలో ఒక లక్ష 70 వేల 618 కేజీల ఎరువులు తయారీ చేసినట్లు.అందులో ఒక లక్ష 50 వేల 819 కేజీల ఎరువుని హరితహారం మొక్కలకి వాడాగా రెండు లక్షల పంతొమ్మిది వేల 503 ఆదాయం వచ్చినట్లు, డ్రై వేస్టేజ్ తో లక్ష 8 వేల 918 కేజీ ల అమ్మకం ద్వారా రెండు లక్షల 30 వేల 519 ఆదాయం వచ్చినట్లు ప్రతినెల గ్రామపంచాయతీల నుండి జిల్లాకి లెక్కలు చూపిస్తున్నారు.

గ్రామపంచాయతీలో ఉన్న షెడ్లలో మాత్రం అధికారులు చెబుతున్నట్లుగా కంపోస్టు ఎరువుల తయారీ మాత్రం జరగడం లేదు.దీంతో ప్రభుత్వం ఆశించిన ఫలితం కాగితాలకే పరిమితం అయిందనే ఆరోపణలు వినిపస్తున్నాయి.

ప్రభుత్వ లక్ష్యం తయారీ విధానం…గ్రామపంచాయతీలోని ప్రభుత్వ ట్రాక్టర్ ట్రాలీనీ రెండు అరలుగా ఏర్పాటు చేసి చెత్త సేకరణ చెత్తను వేరు చేయుట వానపాములచే ఎరువులు తయారీ వాన పాముల ఎంపిక చేస్తారు.సేకరించిన బయోమాస్ తడి వ్యర్థాలను సూర్యరశ్మి తగిలే విధంగా నేలపై పాక్షిక డి కంపోజిషన్ కై నాలుగు రోజులు ఆరబెట్టాలి,ఎరువు తయారీకి ఉపయోగపడే తడి చెత్తను వానపాములు తినడానికి వీలుగా షెల్డర్ ఉపయోగించి అవసరమైన పరిణామానికి మొక్కలుగా చెయ్యాలి లేదా చిన్నచిన్న ముక్కలుగా చేసి ఆరబెట్టాలి ఇలా చేయడం వలన నీరు విషవాయువులు తొలగిపోయి తడి చెత్తలో కుళ్ళిపోనీ వ్యర్ధాలు వేరుగా పెట్టి ఎరువుల తయారీ చెయ్యాలి.

అమ్మకం విధానాలు.సేగ్రీగేషన్ షెడ్ లో నియమిత ప్రదేశంలో కరగని లేదా తిరిగి ఉపయోగించని వ్యర్ధాలను కంపార్ట్మెంట్లో నిండిన కొద్ది రోజుల తర్వాత వాటిని కుదించి సంచుల్లో ప్యాక్ చేసి డీలర్లకు విక్రయిస్తారు.

ఇలా ఒక ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు వేల కోట్లు కేటాయించి తద్వారా ప్రభుత్వ లక్ష్యం నెరవేరే దిశగా పనిచేయాల్సిన అధికారులు కాగితాల్లో తప్ప క్షేత్రస్థాయిలో జరగకపోవడంపై క్షేత్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అన్ని కేంద్రాల్లో పని జరుగుతుంది-యాదయ్య,డిపిఓ సూర్యాపేట జిల్లాలో మొత్తం 475 వర్మి కంపోస్ట్ కేంద్రాలు పని చేస్తున్నాయి.

ఇటీవల కాలంలో భారీ వర్షాలకు అనంతగిరి మండలం చనుపల్లి,ఆత్మకూర్ (ఎస్) మండలం నిమ్మికల్ గ్రామంలో డంపింగ్ యార్డ్ లు ధ్వంసమయ్యాయి.దీనితో సుమారు ఐదు లక్షల వ్యయంతో తిరిగి త్వరలోనే పనులు ప్రారంభిస్తాము.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube