సూర్యాపేట జిల్లా:ఎర్ర జెండా పేదలకు ఎల్లప్పుడు అండగా ఉంటుందని శ్రమజీవుల హక్కులకై కోసం ఎర్రజెండా మాత్రమే ఉద్యమిస్తుందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మట్టిపెళ్లి సైదులు అన్నారు.మంగళవారం మేడే వారోత్సవాల్లో భాగంగా మోతె మండల పరిధిలోని రావిపహాడ్ గ్రామంలో నిర్వహించిన మేడే ర్యాలీలో ఆయన ముఖ్యాతిధిగా పాల్గొని మాట్లాడుతూ అమెరికాలోని చికాగో నగరంలో 1886 వ సంవత్సరంలో 18 గంటల పని విధానాన్ని వ్యతిరేకిస్తూ 8 గంటల పని విధానం కావాలని కార్మికులు పోరాటం చేశారని అన్నారు.ఆ పోరాటంలో ఏడుగురు అమరవీరులను అప్పటి ప్రభుత్వం ఉరి తీశారని అన్నారు.18 గంటల పని విధానం వద్దు ఎనిమిది గంటల పని విధానం కావాలని కార్మికులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని ఆ పోరాటం సందర్భంగా పోలీసులు అక్రమంగా కాల్పులు జరపటం మూలంగా వేలాది మంది కార్మికులు చనిపోయారని,చనిపోయిన కార్మికుల రక్తం నుండి పుట్టిందే ఎర్రజెండా అని గుర్తు చేశారు.నాటి నుండి నేటి వరకు కార్మికులు,కర్షకులు,పేదలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఎర్రజెండా అలుపెరగకుండా పోరాటం చేస్తుందన్నారు.దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలు మార్చివేస్తూ కార్మిక వ్యతిరేక విధానాలను పాల్పడుతుందని విమర్శించారు.
ప్రజలకు చెందాల్సిన సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని ఆరోపించారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పెట్రోల్,డీజిల్,వంటగ్యాస్, విద్యుత్,బస్సు చార్జీలు పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం మోపుతున్నాయని అన్నారు.
ప్రజావ్యతిరేక పరిపాలన కొనసాగిస్తున్న బీజేపీ,టిఆర్ఎస్ పార్టీలకు రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.అంతకుముందు సిపిఎం పార్టీ పతాకాన్ని గ్రామ సీనియర్ నాయకులు కుంచం రాములు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యులు కందాల శంకర్ రెడ్డి,మండల కార్యదర్శి ముల్కరి గోపాల్ రెడ్డి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు,మండల కమిటీ సభ్యులు కంపాటి శ్రీను,కిన్నెర పోతయ్య,సోమగాని మల్లయ్య,శాఖ కార్యదర్శి కుంచం గోపయ్య,డివైఎఫ్ఐ మండల నాయకులు వెలుగు మధు,బాపనపల్లి నాగయ్య,ఎర్రబోయిన మల్సూర్,రాములు,మల్సూర్, కోడి జంపి,వెలుగు మల్లయ్య,వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.